డిసెంబర్ ఖాళీగా వదిలేస్తున్నారా..?
స్టార్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో దర్శక నిర్మాతలకు పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ఫలానా సినిమా ఫలానా డేట్ కి అనుకుంటే అది ఆ డేట్ కి వస్తుందా లేదా అన్న డౌట్ పెరిగేలా చేశారు.
By: Ramesh Boddu | 1 Sept 2025 10:04 AM ISTస్టార్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో దర్శక నిర్మాతలకు పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ఫలానా సినిమా ఫలానా డేట్ కి అనుకుంటే అది ఆ డేట్ కి వస్తుందా లేదా అన్న డౌట్ పెరిగేలా చేశారు. స్టార్ సినిమా అనగానే ముందే పండగకి ఖర్చీఫ్ వేస్తారు. సినిమా అప్పటివరకు పూర్తి అవుతుందా లేదా అన్న క్లారిటీ లేకపోయినా సరే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. అలా రిలీజ్ అనౌన్స్ చేసిన టైం కు వస్తుందా అంటే కష్టమే అవుతుంది. సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్ మస్ ఇలా ఫెస్టివల్ టార్గెట్ తో కొన్ని సినిమాలు వస్తాయి. ఆ సినిమాలు ఆ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల సూపర్ హిట్స్ గా మారుతాయి.
OG, అఖండ 2 రావాల్సింది కానీ..
మిగతా టైం లో రిలీజైతే ఆడవని కాదు కానీ ఫెస్టివల్ మూమెంట్ వాటికి బాగా కలిసి వస్తుంది. ఇదే క్రమంలో ఈ దసరాకి OG, అఖండ 2 రావాల్సింది కానీ అఖండ 2ని పోస్ట్ పోన్ చేస్తున్నారని అనౌన్స్ చేశారు. ఐతే కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇంకా చెప్పలేదు. అఖండ 2 నెక్స్ట్ సంక్రాంతికి ఫిక్స్ అని కొందరు అంటున్నారు. ఐతే డిసెంబర్ లో రావాల్సిన ప్రభాస్ రాజా సాబ్ కూడా సంక్రాంతికి వాయిదా వేశారు. సో డిసెంబర్ నెల ఇప్పుడు పెద్ద సినిమాలు లేక ఖాళీ అవుతుంది.
గత మూడు నాలుగేళ్లుగా డిసెంబర్ లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలు సెన్సేషనల్స్ రికార్డులు సృష్టించాయి. పుష్ప 1, 2, అఖండ, సలార్ ఇలా ఈ సినిమాలన్నీ కూడా డిసెంబర్ లో రిలీజై సక్సెస్ అయ్యాయి. ఈసారి అసలైతే డిసెంబర్ 5న ప్రభాస్ రాజా సాబ్ వస్తుందని అనుకుంటే అది కాస్త జనవరి 9కి వాయిదా వేశారు. పోనీ దసరా మిస్సైన అఖండ 2 అయినా డిసెంబర్ రిలీజ్ ఉంటుంది అనుకుంటే అది కూడా సంక్రాంతికే తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్.
అడివి శేష్ డెకాయిట్..
సో ఇప్పుడు డిసెంబర్ లో స్టార్ సినిమాలు లేఖ ఖాళీ అయిపోయింది. ప్రస్తుతానికి అడివి శేష్ డెకాయిట్ ఒక్కటి డిసెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే డిసెంబర్ నెలకు రెండు రోజులు ముందు రాం ఆంధ్రా కింగ్ తాలూకా వస్తుంది. ఆ సినిమా నవంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. సో రామ్ ఒక్కడికే డిసెంబర్ లక్ కలిసి వచ్చేలా ఉంది. ఇక అడివి శేష్ డెకాయిట్ కూడా క్రేజీ మూవీగా వస్తుంది. ఆ సినిమాకు కూడా క్రిస్మస్ టైం మంచిగా కలిసి వస్తుందని చెప్పొచ్చు.
