ఇంటర్వెల్, క్లైమాక్స్ లను ముందుగా రాసుకొని తర్వాత కథలను రాస్తే కలిగే ఇబ్బందులు ఇవేనా?
ఎప్పుడైనా కథలో నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ పుట్టాలి. అలా కాకుండా వాటిని ముందే రాసుకొని అందులో నుంచి కథను రాసుకోవడం అంత పర్ఫెక్ట్ కాదు.
By: Gopi Velupala | 31 Oct 2026 12:14 PM ISTస్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది చేసే కొన్ని సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలిస్తే మరికొందరు చేసే సినిమాలు డిజాస్టర్లుగా మారుతున్నాయి... ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలను చూస్తే దర్శకులు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ముందుగా డిజైన్ చేసుకొని తర్వాత కథలను రాసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.
అలా చేస్తే కథ చెడిపోవడం లేదా?
ఎప్పుడైనా కథలో నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ పుట్టాలి. అలా కాకుండా వాటిని ముందే రాసుకొని అందులో నుంచి కథను రాసుకోవడం అంత పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటర్వెల్ లో జరిగే సీన్ ను బేస్ చేసుకొని దాని ముందు సీన్లు అల్లుకోవడం అనేది కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. కానీ కథలో నుంచి వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఈజీగా కథతో కనెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా విరామం ముందు వచ్చే సీన్స్ ను బేస్ చేసుకొని కథలు రాసుకోవడం వల్ల అదొక్కటే హైలెట్ అవుతుంది. ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేయడానికి ముందు సీన్స్ ను సమకూర్చినట్టుగా ఉంటుంది తప్ప సినిమా ఒక ఫ్లోలో వెళ్తున్నట్టుగా అనిపించదు.
ఇప్పుడున్న దర్శకులు కొందరు మొదటి గంట సేపు సినిమాని ఎలాగోలాగా నడిపించి ఇంటర్వెల్ హై లెవెల్లో ఇచ్చి, సెకండాఫ్ ను అరకొరగా నడిపించి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో మరోసారి ప్రేక్షకుడికి హై ఫీల్ ఇచ్చే విధంగా సన్నివేశాలను చిత్రీకరిస్తే సరిపోతుంది సినిమా సక్సెస్ అవుతుందనుకుంటున్నారు. కానీ అది అన్నివేళలా వర్కౌట్ కాదు. సినిమా మొత్తం ఓవరాల్ గా ఒక ఫ్లోలో ముందుకు సాగినప్పుడు ప్రేక్షకుడు దానికి కనెక్ట్ అయినప్పుడు ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుడిలో ఇంపాక్ట్ ను క్రియేట్ చేసినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ ని సాధిస్తుంది...
అందుకే ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సినిమాలను మనం చూసుకున్నట్లయితే ఇంటర్వెల్, క్లైమాక్స్ లు మాత్రం సపరేట్ గా ఉంటున్నాయి. ముందుగా వచ్చే సన్నివేశాలు దానికోసం బిల్డ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది తప్ప సినిమా స్టార్ట్ అయినప్పుడు కథలో నుంచి పుట్టిన సీన్లుగా అనిపించడం లేదు. వీటన్నింటికి చెక్ పెడుతూ మంచి కథలను ప్రేక్షకుడికి చెప్పే ప్రయత్నం చేస్తే సినిమాలు మరింత సక్సెస్ ను సాధించడానికి అవకాశం ఉంటుంది.
