Begin typing your search above and press return to search.

స్టాలిన్ రీ రిలీజ్.. ఇలా జరిగిందేంటి?

అయితే చిరు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇప్పటికే యాక్ట్ చేసిన మూవీ స్టాలిన్ రీ రిలీజ్ అయింది. కానీ ఇతర రీ రిలీజ్ ల మాదిరిగా సందడి చేయలేదు.

By:  M Prashanth   |   23 Aug 2025 4:01 PM IST
స్టాలిన్ రీ రిలీజ్.. ఇలా జరిగిందేంటి?
X

కొన్ని నెలలుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే థియేటర్స్ లో విడుదల అయిన అనేక సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్స్ లో మళ్లీ సందడి చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబడుతున్నాయి. కానీ ఇప్పుడు స్టాలిన్ విషయంలో అలా జరగలేదు.

మెగాస్టార్ చిరంజీవి నిన్న తన 70వ బర్త్ డే జరుపుకోగా.. ఆయన ఇప్పుడు నటిస్తున్న/ నటించనున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే చిరు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇప్పటికే యాక్ట్ చేసిన మూవీ స్టాలిన్ రీ రిలీజ్ అయింది. కానీ ఇతర రీ రిలీజ్ ల మాదిరిగా సందడి చేయలేదు.

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా 2006లో విడుదలైంది. చిరుతోపాటు త్రిష కీలక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, ఖుష్బూ, ఊర్వశి శారద ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఆ మూవీ.. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు థియేటర్స్ లో రీ రిలీజ్ అయింది.

అయితే అభిమానులు మాత్రం ఇంద్రతోపాటు చిరంజీవి ఇతర రీ రిలీజ్‌ లను ఆస్వాదించినంతగా ఇప్పుడు స్టాలిన్ మూవీని థియేటర్లలో ఎంజాయ్ చేయలేకపోయారనే చెప్పాలి. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా స్టాలిన్ మూవీ అందరినీ ఆకర్షించేది కాదు.

సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయనే చెప్పాలి. అందుకే పెద్దగా థియేటర్స్ లో మూవీ చూడడానికి మళ్లీ వెళ్లినట్లు లేరు ఆడియన్స్. అదే సమయంలో స్టాలిన్ మూవీ ఆడియో ఆల్బమ్ వేరే లెవెల్ లో హిట్ అయింది. మ్యూజిక్ లవర్స్ ను తెగ మెప్పించాయి. కానీ పాటలన్నీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి.

ఇంటర్వెల్ సీక్వెన్స్ సహా సినిమాను చాలా మంది ఇప్పుడు జనరేషన్ మూవీ లవర్స్ ఇప్పటికే చూసేశారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు రీల్స్, షార్ట్‌ లలో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. కాబట్టి థియేటర్లలో స్టాలిన్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించలేదోమోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.