SSMB29 టైటిల్.. జక్కన్న టెస్టింగ్ ప్లాన్?
నిజానికి, రాజమౌళి తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారని గత బ్లాక్‌బస్టర్స్ నిరూపించాయి.
By: M Prashanth | 9 Oct 2025 10:21 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల, ఈ సినిమా టైటిల్ గురించి ఇండస్ట్రీలో ఒక హాట్ బజ్ మొదలైంది. ఇంతకుముందు 'మహారాజ్', 'గ్లోబ్‌ట్రాటర్', 'GEN63' వంటి పేర్లు వినిపించిన లిస్ట్‌లోకి ఇప్పుడు 'వారణాసి' అనే పేరు వచ్చి చేరింది. ఈ టైటిల్ లీక్ అవ్వడం వెనుక రాజమౌళి ప్లాన్ ఉందా అనే చర్చ మొదలైంది.
నిజానికి, రాజమౌళి తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారని గత బ్లాక్‌బస్టర్స్ నిరూపించాయి. SSMB29 అనేది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ కాబట్టి, టైటిల్ విషయంలో హాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. అందుకే, ఈ 'వారణాసి' టైటిల్ లీక్ అవ్వడం ఫ్యాన్స్‌కు కొందరికి నచ్చడం లేదు. ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ టైటిల్ లీక్ వెనుక జక్కన్న టెస్టింగ్ ప్లాన్ ఉందనేది ఇండస్ట్రీ వర్గాల కొత్త కోణం. గతంలో 'RRR' సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇదే ఫార్ములాను వాడారు. 'RRR' హ్యాష్‌ట్యాగ్ వదిలినప్పుడు, అది జనాల్లోకి బాగా కనెక్ట్ అయింది. దాంతో, చివరికి ఆ హ్యాష్‌ట్యాగ్‌నే ఫైనల్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు. బహుశా ఇప్పుడు 'వారణాసి' టైటిల్‌పై ఆడియెన్స్ రియాక్షన్‌ను టెస్ట్ చేయడానికి ఈ లీక్‌ను ప్లాన్ చేసి ఉండవచ్చు.
మహేష్‌తో జోడీ కడుతున్నది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కావడం, అలాగే K.L. నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తుండటం అంచనాలు పెంచుతోంది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా ప్రమోట్ చేస్తుండగా, 'వారణాసి' లాంటి పేరు ఎందుకు వచ్చిందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
బహుశా వారణాసి తో మరో టైటిల్ ఏదైనా మిక్స్ చేసి ఉండవచ్చు. టైటిల్ లీక్‌లు సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో, రాజమౌళి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సాధారణంగా ఆయన ఇలాంటి ఊహాగానాలపై వెంటనే స్పందించరు. కానీ, ఒకవేళ ఫ్యాన్స్ నుంచి నెగెటివ్ బజ్ పెరిగితే, ఆయన ఖచ్చితంగా ఒక హింట్ ఇవ్వొచ్చు. అసలైన టైటిల్ రివీల్‌ను నవంబర్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా, 'అవతార్' సినిమా దర్శకుడు చేతుల మీదుగా టైటిల్ టీజర్‌ను లాంచ్ చేయాలనే ప్లాన్స్ కూడా జరుగుతున్నట్లు బజ్ ఉంది. మొత్తానికి, ఈ 'వారణాసి' ట్విస్ట్ వెనుక ఉన్న రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే, నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.
