#GlobeTrotterEvent - 15 ఏళ్ల క్రితం రాజమౌళి-మహేష్‌ను కలిసాను: కె.ఎల్.నారాయణ
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB 29 టైటిల్ లాంచ్ వేడుక హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 15 Nov 2025 8:10 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB 29 టైటిల్ లాంచ్ వేడుక హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, కేఎల్ నారాయణ, ఎం.ఎం.కీరవాణి, ఎస్.ఎస్.కార్తికేయ, నమ్రత, సితార ఘట్టమనేని తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ వేదికపై సుమ కనకాల, ఆశిష్ హోస్టింగ్ ఎనర్జీని పెంచింది.
ఈ వేదికపై చిత్రనిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ- ``15 ఏళ్ల క్రితం మహేష్‌ని కలిసి రాజమౌళితో సినిమా చేయాలని భావిస్తున్నట్టు చెప్పాను. దానికి మహేష్ అంగీకరించారు. కానీ ఇంత టైమ్ పడుతుందని ఇద్దరం అనుకోలేదు. సూపర్ స్టార్ కృష్ణ లాగే నిర్మాతల హీరో మన మహేష్. అందుకే ఇన్నాళ్ల తర్వాతా ఆయన దీనిని చేయడానికి ముందుకొచ్చారు`` అని అన్నారు.
``15 ఏళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేయాలని రాజమౌళిని అడిగాను.. అయితే అప్పటికే అంగీకరించిన సినిమాలు పూర్తి చేసాక మా బ్యానర్ లో సినిమా చేస్తానని అన్నారు. ఈగ, బాహుబలి, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ సినిమాలు తీసి ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో అందరికీ తెలుసు. ఈ పదిహేనేళ్లలో ఎంత ఎదిగినా ఆయన ఇప్పటికీ సింపుల్ గా ఉన్నారు. అదే కమిట్ మెంట్ డెడికేషన్ తో ఉన్నారు. ఇలాంటి భారీ సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళిగారికి ధన్యవాదాలు`` అని అన్నారు.
బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లారు. అక్కడ మంచి ఫేమ్ వచ్చింది. భారతీయ సినిమా దశ దిశను మార్చేంత ప్రతిభావని ప్రియాంక చోప్రా. ఈ సినిమాని అంగీకరించినందుకు థాంక్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో పెద్ద స్టార్. రాజమౌళి కథ చెప్పగానే వెంటనే ఎగ్జయిట్ అయ్యి విలన్‌గా నటించేందుకు ఓకే చెప్పారు. ఎంఎం కీరవాణి గురించి నేను ఎక్కు వ చెప్పనవసరం లేదు. మా మొదటి సినిమా `క్షణక్షణం`కి బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పని చేసాం. ఇవాళ ఆస్కార్ సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో సినిమా చేసాం.
ఇది లార్జర్ దేన్ లైప్ కథాంశంతో వస్తున్న సినిమా... త్వరలో మీ ముందుకు తెస్తున్నాం. ఈ వేడుకకు అనుమతి ఇచ్చి సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు. ఎంతో దూరం నుంచి విచ్చేసిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`` అన్నారు.
