SSMB 29.. గూస్ బంప్స్ అప్డేట్..!
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.
By: Ramesh Boddu | 2 Aug 2025 3:22 PM ISTసూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది. మహేష్ తో జక్కన్న చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకుండా సినిమా లాగిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే సినిమాను హైదరాబాద్, ఓడిశాలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు.
టాంజానియా లో షూట్ ప్లాన్..
ఇక నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో టాంజానియా లో షూట్ ప్లాన్ చేశారట టీం రాజమౌళి. సౌత్ ఆఫ్రికా టాంజానియా లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందట. ఈ షెడ్యూల్ లో ప్రియాంక చోప్రాతో పాటు పృధ్విరాజ్ సుకుమారన్ కూడా పాల్గొంటాడని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ ని రాజమౌళి చాలా భారీగా ప్లా చేసినట్టు తెలుస్తుంది.
అసలైతే ఈ పార్ట్ ను ముందు కెన్యాలోని సెరెంగేటి నేషనల్ పార్క్ లో అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ షూటింగ్ చేయడం కుదరక సౌతాఫ్రికా టాంజానియా ప్రదేశంలో ఎస్.ఎస్.ఎం.బి 29 షూటింగ్ ప్లాన్ చేశారట. మహేష్ ఈ సినిమాలో తన కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేయనున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఆసక్తిగా ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం అది ఇవ్వట్లేదు.
రాజమౌళి ప్లాన్ ఏంటన్నది..
మహేష్ బర్త్ డే ఆగష్టు 9కి కూడా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్ ఏంటన్నది తెలియట్లేదు కానీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా పట్ల ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. బాహుబలితో మొదలు పెట్టి ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని సైతం షాక్ అయ్యేలా చేశాడు మన రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ కూడా వచ్చింది అంటే అదంతా రాజమౌళి ప్లానింగ్ వల్లే.
ఐతే SSMB 29 విషయంలో సినిమా, ఇంకా లీడ్ రోల్స్, డైరెక్టర్ కేటగిరిల్లో కూడా అకాడమీ అవార్డుల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నాడట రాజమౌళి. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి.
