ట్రెండింగ్ లో శ్రుతి.. ఇప్పటి వరకు ఎన్ని పాడిందంటే?
అయితే శ్రుతి హాసన్.. సింగర్ గా అవతారమెత్తడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు, తమిళ, హిందీ పాటలను ఆలపించగా.. వాటిలో చాలా సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
By: M Prashanth | 11 Nov 2025 7:09 PM ISTస్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తనలోని సింగింగ్ టాలెంట్ తో మరోసారి సత్తా చాటిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 మూవీకి గాను ఆమె పాడిన పాట రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ లవర్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుని దూసుకుపోతోంది.
ముఖ్యంగా శ్రుతి హాసన్ వాయిస్ ను అంతా కొనియాడుతున్నారు. సాంగ్ ను చాలా బాగా పాడారంటూ అమ్మడుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఆమె నేమ్.. కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మహేష్- జక్కన్న మూవీ కి సాంగ్ పాడడంతో శ్రుతిహాసన్ నేమ్ తో హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ అవుతోంది.
అయితే శ్రుతి హాసన్.. సింగర్ గా అవతారమెత్తడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు, తమిళ, హిందీ పాటలను ఆలపించగా.. వాటిలో చాలా సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఆరేళ్ల వయసులో తండ్రి కమల్ హాసన్ తేవర్ మగన్ చిత్రంలో తన మొదటి పాటను పాడింది శ్రుతి హాసన్. దాన్ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కంపోజ్ చేశారు.
ఆ తర్వాత స్కూల్ లైఫ్ లో శ్రుతి హాసన్.. కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హిందీ భాషా చిత్రం చాచి 420 లో కూడా పాడారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అవకాశం వచ్చినప్పుడల్లా సాంగ్స్ ను పాడుతూనే ఉన్నారు. అనేక పాటలను ఆమె కంపోజ్ చేసి మరీ ఆలపించారు. అలా అటు హీరోయిన్ గా.. ఇటు సింగర్ గా కెరీర్ లో దూసుకుపోతున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాల్లో రెండు పాటలను పాడారు శ్రుతి హాసన్. కాదలిక్క నేరమిల్‌లై మూవీలోని ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఇట్స్ ఎ బ్రేక్ అప్ డా సాంగ్ ను ఆలపించారు. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ లోని ఓ సాంగ్ కు గాత్రం అందించారు. ఇప్పుడు మహేష్ బాబు - రాజమౌళి మూవీలో సింగర్ గా భాగమయ్యారు. అలా ఇప్పటి వరకు 45కుపైగా సాంగ్స్ కు ప్రాణం పోశారు శ్రుతి. ఫ్యూచర్ లో మరిన్ని పాటలతో అలరించేలా కనిపిస్తున్నారు.
