Begin typing your search above and press return to search.

గ్లోబ్ ట్రోటర్.. అంతా ఒకేసారి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   3 Sept 2025 3:51 PM IST
గ్లోబ్ ట్రోటర్.. అంతా ఒకేసారి..
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఉండనున్న మూవీ కోసం అంతా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో.. ఎప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచూస్తున్నారు.

అదే సమయంలో మూవీ అప్డేట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని ఊహించగా.. కేవలం ప్రీ లుక్ మాత్రమే విడుదల చేశారు. అందులో సూపర్ స్టార్.. మెడలో స్పెషల్ లాకెట్ తో కనిపించగా.. అందరి దృష్టిని అది ఆకర్షించింది.

నవంబర్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన రాజమౌళి.. గ్లోబల్ ట్రోటర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. దీంతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస యాత్రకుడి కథతో జక్కన్న మూవీ తీస్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్ గా మారింది. స్టోరీని మొత్తం అంతా ఒకేసారి ఒకే పార్ట్ లో చూపించనున్నారట.

నిజానికి బాహుబలి సిరీస్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రాజమౌళి.. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ తో వేరే లెవెల్ లో అలరించారు. ఆస్కార్ రేంజ్ కు కూడా తీసుకెళ్లారు. కథ మొత్తాన్ని ఒకే పార్ట్ లో చూపించారు. కానీ మహేష్ మూవీ రెండు పార్టుల్లో రూపొందుతుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా ఒకే పార్ట్ లో రానుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని.. ఫ్రాంఛైజీ కాదని వినికిడి. దీంతో ఇప్పుడు నెటిజన్లు అంతా రెస్పాండ్ అవుతున్నారు. వెయిటింగ్ వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు. సినిమాకు సంబంధించి కీలక అప్డేట్స్ ఇప్పటికైనా ఇవ్వండి జక్కన్న అంటూ అడుగుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 2026లో షూటింగ్ పూర్తి కానుందని.. 2027లో సినిమా విడుదల అవ్వనుందని సినీ వర్గాల సమాచారం. మరి రాజమౌళి- జక్కన్న మూవీ అప్డేట్స్ ఎప్పుడొస్తాయో వేచి చూడాలి.