ఎస్ ఎస్ ఎంబీ 29 ప్రఖ్యాత నవలా రచయిత ఆధారంగా!
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎంబీ 29 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 15 Sept 2025 11:44 AM ISTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎంబీ 29 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదొక అడ్వెంచర్ థ్రిల్లర్. కథ అంతా దాదాపు అటవీ నేపథ్యంలోనే సాగుతుంది. గ్లోబ్ ట్రాటింగ్ ఆధారంగా సినిమా ఉంటుంది. ప్రపంచంలో రకరకాల అడవుల్లో ఈసినిమా చిత్రీకరణకు ఆస్కారం ఉంది. అందుకే రాజమౌళి తొలుత ఒరిస్సా శిఖరంపై షూటింగ్ మొదలు పెట్టారు. అటుపై కెన్యా, సౌత్ ఆఫ్రికా అంటూ రకరకాల పార్కులు...అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇంకా సినిమా పూర్తయ్యే లోపు ప్రపం చంలో ఇంకెన్ని అడవుల్లో షూటింగ్ చేస్తారు? అన్నది సస్పెన్స్.
కాశీ సెట్ అద్బుతంగా:
అమెజాన్ అడవుల్లో కూడా చిత్రీ కరణ ఉంటుందని ప్రచారంలో ఉంది. ఇలా ఓవైపు వాస్తవ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు అవసరమైన భారీ సెట్లు వేస్తున్నారు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సెట్స్ విషయంలో రాజమౌళి ఎక్కడా రాజీ పడరు. వాటికే కోట్లు వెచ్చిస్తుంటారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా కాశీ నగరం సెట్ ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నినెలలుగా ఈ సెట్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సినిమాలో కీలక సన్నివేశాలు ఇందులో చిత్రీకరించనున్నారు. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది.
నవల ఆధారంగా ఎస్ ఎస్ ఎంబీ 29:
ఈ నేపథ్యంలో ఈసినిమా కథ ఎలా పురుడు పోసుకుంది? అన్నది బయటకు వచ్చింది. ఈ సినిమాకు కథ అందించింది విజయేంద్ర ప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. రాజమౌళి, -విజయేంద్ర ప్రసాద్ దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన నవల సహా మరికొన్ని పుస్తకాలు ఆధారంగా ఈ సినిమా కథ సిద్దం చేసినట్లు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి స్టోరీ తీసుకున్నా? దాన్ని అద్బుతంగా రాస్తారు. అంతే చక్కగా కమర్శియల్ కోణంలోకి మార్చగలరు.
ఆ ద్వయంతోనే సాధ్యం:
ఈ విషయంలో విజయేంద్ర ప్రసాద్ మాస్టర్. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తున్నారు. ప్లాప్ ల్లో ఉన్న హీరోలను సైతం పైకి లేపుతున్నారు. ఈ కథలను కమర్శియల్ గా మార్చడంలో రాజమౌళి పాత్ర అత్యంత కీలకమైంది. ఆ కథకు సినిమాటిక్ రూపం తీసుకురావడం? కథలో భావోద్వేగాలను హైలైట్ చేయడం జక్కన్న ప్రత్యేకత. ఇలా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు విజయేంద్ర ప్రసాద్-రాజమౌళి ద్వయం తోనే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతున్నాయి.
