Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి మాస్ట‌ర్ ప్లాన్ ఏంటో

ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ29లో రాజ‌మౌళి ఓ స్పెష‌ల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేశార‌ట‌. రీసెంట్ టైమ్స్ లో స్పెష‌ల్ సాంగ్స్ కు ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Oct 2025 1:13 PM IST
రాజ‌మౌళి మాస్ట‌ర్ ప్లాన్ ఏంటో
X

ఇండియ‌న్ సినిమాలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న సినిమాల్లో రాజ‌మౌళి, మ‌హేష్ బాబు క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న సినిమా కూడా ఒక‌టి. ఎస్ఎస్ఎంబీ29 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో..

మ‌హేష్ బర్త్ డే కు ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే కేవ‌లం మెడ‌లో ఓ లాకెట్ ఉన్న ఫోటోతో స‌రిపెట్టి, న‌వంబ‌ర్ లో అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని చెప్పి అంచ‌నాల‌ను పెంచిన రాజ‌మౌళి, ఈ సినిమాను పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. అందులో భాగంగానే గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్న జ‌క్క‌న్న‌, మ‌రికొంద‌రు టాలెంటెడ్ న‌టుల్ని కూడా ఈ సినిమాలో భాగం చేశారు.

మ‌హేష్- ప్రియాంక‌పై ఓ ఫోక్ సాంగ్

దాదాపు రూ.1200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం రాజ‌మౌళి హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా రానున్న ఈ సినిమా విష‌యంలో జ‌క్క‌న్న ప్ర‌తీదీ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారట‌. అందులో భాగంగానే ఇప్ప‌టికే మ‌హేష్, ప్రియాంక‌పై ఓ ఫోక్ సాంగ్ ను షూట్ చేశార‌ని రీసెంట్ గా వార్త‌లొచ్చాయి.

ఎస్ఎస్ఎంబీ29లో స్పెష‌ల్ సాంగ్

ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ29లో రాజ‌మౌళి ఓ స్పెష‌ల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేశార‌ని ఒక కొత్త ప్రచారం స్టార్ట్ అయ్యింది. రీసెంట్ టైమ్స్ లో స్పెష‌ల్ సాంగ్స్ కు ఎంత డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. అటు రాజ‌మౌళి కూడా త‌న సినిమాల్లో కుదిరిన‌ప్పుడ‌ల్లా స్పెష‌ల్ సాంగ్స్ ను పెడుతూనే వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఈ మూవీలో జ‌క్క‌న్న ఓ స్పెష‌ల్ సాంగ్ ను ప్లాన్ చేయ‌గా, అందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క‌నిపించ‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి.

సాహో సాంగ్ లో చిందులేసిన జాక్వెలిన్

జాక్వెలిన్ ఇప్ప‌టికే ప‌లు స్పెష‌ల్ సాంగ్స్ చేశారు. టాలీవుడ్ లో వ‌చ్చిన సాహో లో కూడా జాక్వెలిన్ ప్ర‌భాస్ తో క‌లిసి కాలు క‌దిపారు. మ‌హేష్ కోసం ప్ర‌తీదీ నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేస్తూ, సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న జ‌క్క‌న్న అనుకోవాలే కానీ ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం కూడా హాలీవుడ్ భామ‌ను రంగంలోకి దింపొచ్చు. అవ‌కాశం ఉంచుకుని కూడా రాజమౌళి ఎందుకు ఇలా సింపుల్ గా ప్లాన్ చేస్తారు ఇది రాంగ్ న్యూస్ అయ్యి ఉంటుంది అని చర్చ ఫాన్స్ లో నడుస్తుంది, స్పెష‌ల్ సాంగ్ కోసం హ‌లీవుడ్ భామ‌ను తీసుకుంటే అక్క‌డ కూడా సినిమాకు హైప్ పెరిగే ఛాన్సుంటుంది క‌దా.. రాజ‌మౌళి ఈ లాజిక్ ఎలా మిస్ అవ్వుతారు అని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి స్పెష‌ల్ సాంగ్ విష‌యంలో రాజ‌మౌళి మాస్ట‌ర్ ప్లాన్ ఏంటో తెలియాల్సి ఉంది.