కీరవాణి మరో ఆస్కార్ గురి..?
ఐతే నెక్స్ట్ రాజమౌళి చేస్తున్న మహేష్ 29 సినిమాకు కూడా కీరవాణి ఒక రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నారట. ఈ సినిమా కోసం కీరవాణి అందిస్తున్న మ్యూజిక్ మరోసారి ఆస్కార్ గురి అన్నట్టుగా ఉంటుందట.
By: Ramesh Boddu | 27 Aug 2025 9:32 AM ISTRRR సినిమాతో ఎం.ఎం కీరవాణి అకాడమీ అవార్డ్ అందుకున్నారు. నాటు నాటు సాంగ్ పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ మొత్తం షేక్ చేసింది. ఆ సాంగ్ కంపోజింగ్.. దానికి కొరియోగ్రఫీ.. అందులో చరణ్, తారక్ డాన్స్ ఇలా అన్నీ కూడా అలా అదిరిపోయేలా కుదిరాయి. అందుకే ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అయ్యి ఆస్కార్ ని సైతం గెలుచుకుంది. ఆస్కార్ వేదిక మీద తన పాట అవార్డ్ గెలుచుకున్న సందర్భాన్ని కీరవాణి ఎప్పుడూ గుర్తు చేసుకుంటారు.
రాజమౌళి నెక్స్ట్ లెవెల్ లో..
ఐతే నెక్స్ట్ రాజమౌళి చేస్తున్న మహేష్ 29 సినిమాకు కూడా కీరవాణి ఒక రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నారట. ఈ సినిమా కోసం కీరవాణి అందిస్తున్న మ్యూజిక్ మరోసారి ఆస్కార్ గురి అన్నట్టుగా ఉంటుందట. ఇప్పటికే SSMB 29 సినిమా గురిచి ఏ క్లూ విన్నా.. ఏ అప్డేట్ చూసినా రాజమౌళి నెక్స్ట్ లెవెల్ లో సినిమా తెరకెక్కిస్తున్నాడని అన్నారు. అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్స్ తోనే అదరగొట్టేస్తాడని అంటున్నారు.
సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృధ్విరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. రాజమౌళి మహేష్ కాంబో సినిమా విజువల్ ట్రీట్ పక్కా అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో కేవలం సాంగ్ కే ఆస్కార్ వచ్చింది. అందుకే ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా విషయంలో సినిమా, డైరెక్టర్, హీరో ఇలా అన్ని విభగాల్లో అవార్డ్ గురి పెడుతున్నాడట రాజమౌళి.
2027 రిలీజ్ చేసేలా..
రాజమౌళి అండ్ టీం ఈ సినిమా కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలుస్తుంది. మహేష్ కూడా రాజమౌళికి కావాల్సిన విధంగా తన డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు. త్వరలో ఫారిన్ లో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ssmb 29 టీం. 2027 రిలీజ్ చేసేలా రాజమౌళి వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం కొన్నాళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ సినిమా ఇన్నేళ్ల వెయిటింగ్ ని మర్చిపోయేలా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సెటప్ రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.
మహేష్ కూడా ఈ సినిమా కోసం ఎప్పుడు లేని విధంగా మాస్ ఎలిమెంట్స్ తో లైక్ షర్ట్ లెస్.. ఇంకా కెరీర్ లో ఇప్పటివరకు చేయని కొన్ని విషయాలు చేస్తున్నారట. తప్పకుండా తెర మీద సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఇది నచ్చేస్తుందని అంటున్నారు.
