హాలీవుడ్ బిగ్ స్టూడియోతో జక్కన్న.. ప్లాన్ ఏంటీ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ SSMB 29 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే
By: M Prashanth | 16 Sept 2025 11:11 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ SSMB 29 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవులు నేపథ్యంలో సాగే సాహస ప్రయాణం గ్లోబల్ ట్రోటర్ గా మూవీ రూపొందుతున్నట్లు టాక్.
అయితే రీసెంట్ గా కెన్యాలోని నైరోబీలో సినిమాకు సంబంధించి బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించినట్లు తెలుస్తోంది. సినిమాకు రాజమౌళి కాస్త డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు వినికిడి. ఇప్పుడు ఫిల్మ్ సిటీ లో కాశీ సెట్ వేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అక్టోబర్ 10వ తేదీ వరకు ఆ సెట్ లో మహేష్ బాబుతో పాటు మెయిన్ క్యాస్టింగ్ పై మేకర్స్ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఎలాంటి లీక్స్ కాకుండా జక్కన్న కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. రాజమౌళి భారీ డీల్ కుదుర్చుకున్నారట.
ఇటీవల హాలీవుడ్ స్టూడియోతో ఒక ప్రధాన ఒప్పందాన్ని ఆయన ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రముఖ వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి- మహేష్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. అమెరికా సహా కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లలో సినిమాను ప్రమోట్ చేయనుందని టాక్ వినిపిస్తోంది.
దీంతో సినిమాకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చినట్లే. అదే సమయంలో అది నిజమైతే.. రాజమౌళి తన సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ను కొన్ని నెలల ముందుగానే హాలీవుడ్ స్టూడియోకు సమర్పించాల్సి ఉంటుంది. విడుదలకు కనీసం మూడు నెలల ముందు కంప్లీట్ మూవీ ఫైల్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
మన దగ్గర రిలీజ్ కు వారం ముందే సెన్సార్ ఫార్మాలిటీస్ జరిగితే.. హాలీవుడ్ స్టూడియోలు మాత్రం సాధారణంగా ఒక నెల ముందుగానే అన్ని ఫార్మాలిటీలు కంప్లీట్ చేస్తాయి. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ప్రెస్ షోలు, డిస్ట్రిబ్యూటర్ స్క్రీనింగ్ లు, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాలను ప్రణాళికతో నిర్వహిస్తాయి. మరి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
