Begin typing your search above and press return to search.

పీసీ పోస్ట్.. రాజమౌళి పై డౌట్ ఎందుకు..?

రాజమౌళి మహేష్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా ఎదుచూస్తున్నారో తెలిసిందే. మహేష్ బర్త్ డే నాడు రాజమౌళి నవంబర్ నుంచి అప్డేట్స్ మొదలు పెడదామని చెప్పాడు.

By:  Ramesh Boddu   |   20 Aug 2025 1:40 PM IST
పీసీ పోస్ట్.. రాజమౌళి పై డౌట్ ఎందుకు..?
X

రాజమౌళి మహేష్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా ఎదుచూస్తున్నారో తెలిసిందే. మహేష్ బర్త్ డే నాడు రాజమౌళి నవంబర్ నుంచి అప్డేట్స్ మొదలు పెడదామని చెప్పాడు. ఐతే నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ రెడీ చేస్తున్నామని అన్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎస్.ఎస్.ఎం.బి 29 అప్డేట్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఐతే వాళ్ల ఎగ్జైట్మెంట్ ని గుర్తించిన హీరోయిన్ ప్రియాంక చోప్రా కొన్ని లీక్స్ ఇస్తుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

హాలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి..

ఈ సినిమాలో పీసీ ప్లేస్ అవ్వడం వల్ల హాలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది. అంతేకాదు రాజమౌళి ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందట. అదే జరిగితే ఈసారి మహేష్ పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాలో కొన్ని యానిమల్స్ ఫోటోలను షేర్ చేసింది. ప్రైడ్ లాండ్స్ అంటూ హైనా, హిప్పోపొటామస్, ఆస్ట్రిచ్, ఆఫ్రికన్ బఫెలో ఫోటోస్ షేర్ చేసింది.

రాజమౌళి మహేష్ సినిమా కోసం నెక్స్ట్ షెడ్యూల్ ని నైరోబి షిఫ్ట్ చేస్తున్నాడని టాక్. ఈ టైం లో ప్రియాంక చోప్రా ఈ యానిమల్స్ ఫోటోస్ షేర్ చేయడంతో ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రియల్ యానిమల్స్ తో రాజమౌళి షూట్ చేస్తాడా అన్న డౌట్ మొదలైంది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి ఏదైనా చేస్తాడు. గ్లోబ్ త్రెట్టిన్ అంటూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ సినిమా వస్తుంది.

సీజీ షాట్స్ రియల్ అప్పీల్ ఇచ్చేలా..

ఈ సినిమాలో సీజీ షాట్స్ కి స్కోప్ ఉంది. ఐతే రియల్ అప్పీల్ ఇచ్చేలా ఒరిజినల్ యానిమల్స్ ని వాడుతున్నారట. ఐతే వాటిని గ్రాఫిక్స్ తో మిక్స్ చేసి చూపిస్తారని టాక్. సినిమా ఎలా తీయాలన్నది రాజమౌళి ముందే స్టోరీ బోర్డ్ రాసుకుని ఉంటాడు. దాన్ని బట్టే షూట్ చేస్తూ వెళ్తుంటాడు. రాజమౌళి సీజీ వాడినా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈమధ్యనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ ని కూడా వేస్తున్నారని టాక్ వచ్చింది.

సో ఎస్.ఎస్.ఎం.బి 29 కోసం రాజమౌళి తన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ తో వెళ్తున్నాడు. తప్పకుండా ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ అందరికీ ఈ సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ సినిమా కథకు రాజమౌళి డైరెక్షన్, టేకింగ్ అంతా కూడా హాలీవుడ్ రేంజ్ అని అంటున్నారు.