మహేష్-రాజమౌళి నాన్ స్టాప్ బ్యాటింగ్!
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 14 Sept 2025 9:00 PM ISTఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్- రాజమౌళి చేస్తున్న మొదటి సినిమా కావడం, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడమే దానికి కారణం.
ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే..
మామూలుగా సినిమాను మొదలుపెట్టే ముందు ప్రెస్ మీట్ పెట్టి సినిమాను అనౌన్స్ చేసి దాని గురించిన వివరాలు వెల్లడించే రాజమౌళి, మహేష్ తో చేస్తున్న సినిమాను మాత్రం ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండానే సైలెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తున్నారు.
రీసెంట్ గా కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29
రాజమౌళి సినిమా అంటే ఎంత టైమ్ పడుతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ జక్కన్న ఎస్ఎస్ఎంబీ29 ను మాత్రం తన గత సినిమాలతో పోలిస్తే శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ ను జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్టు రీసెంట్ గానే కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో కెన్యాలోని భారీ ఛేజింగ్ సీన్స్, కొన్ని యాక్షన్ సీన్స్ ను మేకర్స్ తెరకెక్కించారట.
కాశీ సెట్ లో ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్
కెన్యా షూటింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ ను వేసినట్టు సమాచారం. ఈ షూటింగ్ లో సినిమాలోని కీలక తారాగణమంతా పాల్గొననుండగా, అక్టోబర్ 1 వరకు ఈ షెడ్యూల్ ఎలాంటి బ్రేకుల్లేకుండా జరగనున్నట్టు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ తో 50% షూటింగ్ పూర్తి
ఎస్ఎస్ఎంబీ29 ఫస్టాఫ్ లో వచ్చే కీలక సీన్స్ ను ఇక్కడ షూట్ చేయనున్నాని, ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు 50% పూర్తవుతుందని అంటున్నారు. మొత్తానిక రాజమౌళి ఈ సినిమా షూటింగును ఎలాంటి బ్రేకుల్లేకుండా, నాన్ స్టాప్ గా షూట్ చేస్తూ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా తీసుకెళ్తున్నారని అర్థమవుతుంది. కాగా నవంబర్ లో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
