Begin typing your search above and press return to search.

మహేష్ మెడలో లాకెట్.. జక్కన్న హింట్స్ ఇచ్చారా?

SSMB 29 ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ.

By:  M Prashanth   |   9 Aug 2025 4:11 PM IST
మహేష్ మెడలో లాకెట్..  జక్కన్న హింట్స్ ఇచ్చారా?
X

SSMB 29 ప్రాజెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే హైలెవెల్ లో అంచనాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ లో వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ అయింది.

అయితే రాజమౌళి ఎప్పుడూ తాను చేసిన సినిమాల టైమ్ లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని డిటైల్స్ అనౌన్స్ చేస్తారు. కానీ SSMB 29 విషయంలో విరుద్ధంగా ముందుకెళ్తున్నారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ప్రెస్ మీట్ పెట్టలేదు. క్యాస్టింగ్ ను అనౌన్స్ చేయలేదు. పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా బయటకు రాలేదు.

సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత పలు సినిమాల ఈవెంట్స్ లో వేదికపై సందడి చేశారు జక్కన్న. కానీ మహేష్ తో మూవీ కోసం మాత్రం ఒక్క లీక్ కూడా ఇవ్వలేదు. నేడు మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజమౌళి మాత్రం ప్రీ లుక్ నే విడుదల చేశారు.

ఆ సమయంలో ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. నవంబర్ లో కంప్లీట్ లుక్ ను రివీల్ చేస్తామని తెలిపారు. అయితే మహేష్ ప్రీ లుక్ లో ఆయన మెడలో లాకెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెడలో త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. దీంతో దానికి సినిమాలో ప్రాధాన్యత ఉంటుందేమోనని అంతా ఊహిస్తున్నారు.

మరోవైపు.. జక్కన్న తన పోస్ట్ కు #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్‌ ను జోడించారు. దీంతో సినిమాలో హీరోను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్లు పరోక్షంగా చెప్పినట్టు ఉన్నారని నెటిజన్లు, సినీ ప్రియులు గెస్ చేస్తున్నారు. ఆ రెండు ఎలిమెంట్స్ తోనే హింట్స్ ఇచ్చారని అంటున్నారు.

అయితే అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా సినిమాను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రీ లుక్ తో రెండు ఎలిమెంట్స్ ను చూపించిన జక్కన్న.. సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.