రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్'.. ఇంటర్నేషనల్ ప్లాన్ ఏంటి?
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.
By: M Prashanth | 14 Nov 2025 1:11 PM ISTదర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఒక్కొక్క షెడ్యూల్ ను ముందు అనుకున్న టైమ్ కే కంప్లీట్ చేస్తూ వస్తున్నారంట జక్కన్న.
వచ్చే ఏడాది గ్లోబ్ ట్రాటర్ షూటింగ్ కంప్లీట్ అవ్వనుండగా.. 2027లో సినిమా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. మహేష్ మూవీ SSMB 29ని అంతర్జాతీయ మూలలకు తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అందుకు గాను ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో రాజమౌళి వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. ఏదేమైనా ఇంటర్నేషనల్ రేంజ్ లో సినిమా అనుకున్నట్లు రిలీజ్ అవ్వాలంటే కచ్చితంగా హాలీవుడ్ స్టూడియో హెల్ప్ అవసరం. అప్పుడే మూవీకి అన్ని దేశాల్లో ప్రమోషన్స్ బాగా జరుగుతాయి.
ముఖ్యంగా బడా హాలీవుడ్ సినిమాలను డీల్ చేసిన మంచి క్యాప్ బిలిటీ ఉన్న స్టూడియో సపోర్ట్.. గ్లోబ్ ట్రాటర్ కు కావాలి. అందుకు గాను ఇప్పటికే మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఏదీ ఫిక్స్ అవ్వనప్పటికీ.. డిస్కషన్స్ జరుగుతున్నాయని వినికిడి.
అయితే ఇప్పుడు మూవీ టీమ్ అంతా ఈవెంట్ బిజీలో ఉంది. రేపు గ్రాండ్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆ సమయంలో మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేసి.. టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మందాకిని, కుంభ పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఇంటర్నేషనల్ ప్లాన్ విషయంలో గ్లోబ్ ట్రాటర్ మూవీ టీమ్ చేయనుందో వేచి చూడాలి.
