జక్కన్న జాగ్రత్త పడాల్సిన టైమొచ్చింది
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య లీకుల బెడద మరీ ఎక్కువైపోతుంది. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు ప్రతీ సినిమాకు షూటింగ్ టైమ్ నుంచే లీకులు ఎక్కువవుతున్నాయి. ఈ లీకుల వల్ల దర్శకనిర్మాతలకు నష్టం వాటిల్లడంతో పాటూ సినిమాపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. వీటిని అరికట్టడానికి మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే నష్టం జరుగుతూనే ఉంటోంది. గతంలో ఒడిశా షెడ్యూల్ నుంచి వీడియో లీక్ దర్శకధీరుడు రాజమౌళికి సైతం ఈ లీకుల తలనొప్పి తప్పడం లేదు. ఎంత కేర్ తీసుకుంటున్నా ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ నుంచి లీకులు ఆగడం లేదు. మొదట్లో ఒడిశాలో జరిగిన షెడ్యూల్ నుంచి ఏకంగా వీడియోనే లీకై సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ తర్వాత సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు జక్కన్న. ఆ లీక్ తర్వాత రాజమౌళి సెక్యురిటీని చాలా టైట్ చేశారని, ఇకపై ఎలాంటి లీకులు జరిగే ఆస్కారమే లేదని అన్నారు కానీ ఇప్పుడు మరో లీక్ బయటికొచ్చింది. ఇప్పుడు మరోసారి.. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ ప్రస్తుతం కెన్యాలోని నైరోబీలో జరుగుతుండగా, సెట్స్ నుంచి ఓ ఫోటో లీకై అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. లీకైన ఫోటోలో మహేష్ లుక్ ను చూసి ప్రశంసిస్తూనే ఇలా సెట్స్ నుంచి ఫోటోలు లీకవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలో మహేష్ సింహంలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వార్నింగ్ ఇచ్చినా.. ఇతర డైరెక్టర్ల కంటే రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏ విధంగానూ కంటెంట్ బయటకు లీకవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎస్ఎస్ఎంబీ29 విషయంలో జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవేవీ లీకులను ఆపలేకపోతున్నాయి. గతంలో ఒడిశా షెడ్యూల్ నుంచి వీడియో లీకైనప్పుడే ఇలాంటివి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చిత్ర యూనిట్. అయినా మరోసారి ఫోటో లీకవడం మహేష్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇకనైనా ఎస్ఎస్ఎంబీ29 టీమ్ ఇలాంటి లీకులు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదముందని సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాబట్టి ఇలాంటి వాటికి పర్మినెంట్ గా ఫుల్‌స్టాప్ పెట్టడానికి చిత్ర యూనిట్ వెంటనే రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చింది. దీన్ని ఇలానే వదిలేస్తే లీకుల రాయుళ్లు మరింత రెచ్చిపోయి సినిమాపై ఆడియన్స్ కు ఉన్న ఇంట్రెస్ట్ ను తగ్గించే ప్రమాదముంది. అసలే రూ.1200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి జక్కన్న ఈ మూవీ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 5 Sept 2025 11:21 AM ISTసినీ ఇండస్ట్రీలో ఈ మధ్య లీకుల బెడద మరీ ఎక్కువైపోతుంది. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు ప్రతీ సినిమాకు షూటింగ్ టైమ్ నుంచే లీకులు ఎక్కువవుతున్నాయి. ఈ లీకుల వల్ల దర్శకనిర్మాతలకు నష్టం వాటిల్లడంతో పాటూ సినిమాపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. వీటిని అరికట్టడానికి మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే నష్టం జరుగుతూనే ఉంటోంది.
గతంలో ఒడిశా షెడ్యూల్ నుంచి వీడియో లీక్
దర్శకధీరుడు రాజమౌళికి సైతం ఈ లీకుల తలనొప్పి తప్పడం లేదు. ఎంత కేర్ తీసుకుంటున్నా ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ నుంచి లీకులు ఆగడం లేదు. మొదట్లో ఒడిశాలో జరిగిన షెడ్యూల్ నుంచి ఏకంగా వీడియోనే లీకై సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ తర్వాత సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు జక్కన్న. ఆ లీక్ తర్వాత రాజమౌళి సెక్యురిటీని చాలా టైట్ చేశారని, ఇకపై ఎలాంటి లీకులు జరిగే ఆస్కారమే లేదని అన్నారు కానీ ఇప్పుడు మరో లీక్ బయటికొచ్చింది.
ఇప్పుడు మరోసారి..
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ ప్రస్తుతం కెన్యాలోని నైరోబీలో జరుగుతుండగా, సెట్స్ నుంచి ఓ ఫోటో లీకై అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. లీకైన ఫోటోలో మహేష్ లుక్ ను చూసి ప్రశంసిస్తూనే ఇలా సెట్స్ నుంచి ఫోటోలు లీకవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలో మహేష్ సింహంలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
వార్నింగ్ ఇచ్చినా..
ఇతర డైరెక్టర్ల కంటే రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏ విధంగానూ కంటెంట్ బయటకు లీకవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎస్ఎస్ఎంబీ29 విషయంలో జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవేవీ లీకులను ఆపలేకపోతున్నాయి. గతంలో ఒడిశా షెడ్యూల్ నుంచి వీడియో లీకైనప్పుడే ఇలాంటివి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చిత్ర యూనిట్. అయినా మరోసారి ఫోటో లీకవడం మహేష్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది.
ఇకనైనా ఎస్ఎస్ఎంబీ29 టీమ్ ఇలాంటి లీకులు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదముందని సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాబట్టి ఇలాంటి వాటికి పర్మినెంట్ గా ఫుల్‌స్టాప్ పెట్టడానికి చిత్ర యూనిట్ వెంటనే రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చింది. దీన్ని ఇలానే వదిలేస్తే లీకుల రాయుళ్లు మరింత రెచ్చిపోయి సినిమాపై ఆడియన్స్ కు ఉన్న ఇంట్రెస్ట్ ను తగ్గించే ప్రమాదముంది. అసలే రూ.1200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి జక్కన్న ఈ మూవీ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
