శాంపిల్ తోనే చుక్కలు చూపించబోతున్న రాజమౌళి..!
RRR తర్వాత ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ తో గ్లోబ్ త్రొటెన్ సినిమా అంటూ భారీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లారు.
By: Ramesh Boddu | 17 Oct 2025 11:10 AM ISTRRR తర్వాత ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ తో గ్లోబ్ త్రొటెన్ సినిమా అంటూ భారీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లారు. సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నా కూడా తాను చెప్పే వరకు వెయిట్ చేయక తప్పదని ఫిక్స్ అయ్యారు. రాజమౌళి మహేష్ సినిమా అప్డేట్ నవంబర్ లో రాబోతుంది. డేట్ వాళ్లు చెప్పలేదు కానీ నవంబర్ 16న SSMB 29 టీజర్ వస్తుందని అంటున్నారు.
మహేష్ హెవీ వర్క్ అవుట్స్..
ఐతే రాజమౌళి ఈ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించబోతున్నారట. కెన్యా అడవులతో పాటు ఒడిశాలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది. త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చింది. ఐతే నెక్స్ట్ వస్తున్న ఈ సినిమాతో హాలీవుడ్ కి షాక్ ఇవ్వాలని చూస్తున్నాడు జక్కన్న.
ఇక నవంబర్ లో వచ్చే ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఈ సినిమా రేంజ్ ఏంటన్నది చూపించబోతున్నారట. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమాకు మైథాలజీ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి మైథాలజీ టచ్ అంటే అది వేరే రేంజ్ అన్నట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈమధ్య తెలుగు పాన్ ఇండియా సినిమాల్లో మైథాలజీ టచ్ తో సినిమాలు వస్తున్నాయి. ఐతే వాటి ఇంపాక్ట్ కేవలం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి.
నవంబర్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..
ఐతే రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కూడా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. సినిమా కోసం 2 కోట్ల వైలువైన సెట్ కూడా హైదరాబాద్ లో వేశారని తెలుస్తుంది. నవంబర్ కోసం సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ తోనే రెండున్నర గంటల సినిమా శాంపిల్ చూపిస్తాడని తెలుస్తుంది. సో రాజమౌళి సినిమా.. అందులోనూ మహేష్ బాబు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై పాన్ ఇండియా లెవెల్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
రాజమౌళి మహేష్ ఒక ప్లానింగ్ ప్రకారంగానే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. 2027 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు. సినిమాలో ప్రతి అంశం సినీ లవర్స్ కి విజువల్ ట్రీట్ అందిస్తుందని తెలుస్తుంది. రాజమౌళి తన ప్రతి సినిమాకు పెట్టే ఫోకస్ కి మహేష్ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. సినిమాతో కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు అవార్డులను కూడా టార్గెట్ పెట్టుకున్నాడు రాజమౌళి.
