SSMB 29: లయన్‌తో మహేష్ వీడియో.. ఇదెక్కడి హడావుడి బాబు!
టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన ప్రాజెక్ట్ SSMB29.
By: M Prashanth | 8 Sept 2025 1:04 AM ISTటాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొల్పిన ప్రాజెక్ట్ SSMB29. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే పాన్ ఇండియా లెవెల్‌లో హడావుడి చేస్తోంది. ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చర్చనీయాంశమైంది.
18 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో మహేష్ బాబు కెన్యా అడవుల మధ్యలో ఒక స్టిక్ పట్టుకుని నడుస్తూ, ఆయన పక్కనే ఒక సింహం నడుస్తున్నట్లు చూపించారు. ఈ క్లిప్ బయటకివచ్చిన తర్వాత “ఇది నిజంగానే షూటింగ్‌లోనిదేనా?” అని అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున డిస్కషన్ చేస్తున్నారు. కొందరు అయితే ఇది నిజమైన సీన్ అని నమ్ముతూ ఎగ్జైట్ అవుతున్నారు.
కానీ రియాలిటీ ఏంటంటే.. ఆ వీడియో నిజమైనది కాదు. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా క్రియేట్ చేసిన క్లిప్. మహేష్ బాబు షూటింగ్ సెట్స్‌లో ఉన్న రియల్ ఫొటోను తీసుకుని, దానిలో AI టచ్ తో పక్కనే లయన్‌ని చూపించారు. జాగ్రత్తగా గమనిస్తే మోషన్, లైటింగ్, షాడోస్ అన్నీ అసలు లొకేషన్‌తో కలిసిపోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ లీక్ అనేది అసలైన ఫుటేజ్ కాదు, సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసేందుకు కొందరు తయారుచేసిన AI అవుట్‌పుట్ మాత్రమే.
ఇకపోతే, రాజమౌళి సినిమాల్లో యాక్షన్, విజువల్స్ నెవ్వర్ బిఫోర్ అనిపించేలా ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. ఈ సారి కథ మొత్తం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుంది. కెన్యా, సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారని, హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని సమాచారం. అందుకే ఇలాంటి వాస్తవానికి దగ్గరగా ఉన్న AI వీడియోలు ఫ్యాన్స్‌కి మరింత రియలిస్టిక్‌గా అనిపిస్తున్నాయి.
ఫ్యాన్స్ ఎగ్జైట్ కావడం సహజమే కానీ, సినిమా యూనిట్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్ రానుందని రాజమౌళి ఇప్పటికే చెప్పాడు. అప్పటివరకూ వస్తున్న లీక్ వీడియోలు, ఫోటోలు అన్నీ ఊహాగానాలే తప్ప, నిజమైనవి కావని గమనించాలి. అయినప్పటికీ, ఈ ఒక్క క్లిప్‌తోనే సినిమా పైన ఉన్న క్రేజ్ ఎలాంటి స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. నిజమైన గ్లింప్స్ రాగానే సోషల్ మీడియా మొత్తం ఊగిపోవడం ఖాయం.
