SSMB29: క్రికెట్ ఫీవర్‌ను వాడుకుంటున్న జక్కన్న.. అనౌన్స్‌మెంట్ కాదు, ఈవెంట్!
ప్రస్తుతం దేశం మొత్తం ఇండియా ఆస్ట్రేలియా టీ20 సిరీస్ తో పాటు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్‌లో ఊగిపోతోంది.
By: M Prashanth | 2 Nov 2025 8:00 PM ISTప్రస్తుతం దేశం మొత్తం ఇండియా ఆస్ట్రేలియా టీ20 సిరీస్ తో పాటు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్‌లో ఊగిపోతోంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ల మధ్యలో వచ్చే యాడ్స్ మీద కూడా అంతే ఫోకస్ ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. మహేష్ బాబుతో తాను తీస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ (SSMB29) అనౌన్స్‌మెంట్ కోసం, ఈ క్రికెట్ ఫీవర్‌ను వాడుకుంటూ ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీకి తెరలేపారు.
ఇది ముందే ప్లాన్ చేశారో లేక అనుకోకుండా వచ్చిన టైమింగో ఏమిటో గాని క్రికెట్ ఫీవర్ లో అయితే సినిమా అప్డేట్ ను బాగా హైలెట్ చేస్తున్నారు. ఇక మూడో టీ20 మ్యాచ్ మధ్యలో వస్తున్న యాడ్స్‌లో ఇప్పుడు SSMB29 అనౌన్స్‌మెంట్ గురించిన ప్రచారమే హైలైట్‌గా నిలుస్తోంది. ఇది రెగ్యులర్ అనౌన్స్‌మెంట్ కాదు. నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ "ఫస్ట్ రివీల్ ఈవెంట్" ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ద్వారా సినిమా టైటిల్ గ్లింప్స్‌ను లాంచ్ చేయబోతున్నారు.
ఇందులో అసలైన కిక్ ఏంటంటే, ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్ సంస్థ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. క్రికెట్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమ్ చేసే ప్లాట్‌ఫామ్‌లోనే, ఒక సినిమా అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌ను కూడా లైవ్ టెలికాస్ట్ చేయడం అనేది ఇండియన్ సినిమాలో ఇదే మొదటిసారి. ఇది సినిమా ఈవెంట్‌ను కూడా ఒక స్పోర్టింగ్ ఈవెంట్ రేంజ్‌కు తీసుకెళ్లే ప్లాన్.
ఈ ఈవెంట్ ఎలా ఉండబోతోందనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మొదట జేమ్స్ కెమెరున్ వస్తారని ఆయన ద్వారా టీజర్ రావచ్చని అన్నారు. కానీ ప్రస్తుతానికి అలాంటిది ఉండకపోవచ్చని తెలుస్తోంది. RRR తర్వాత వస్తున్న సినిమా అయినా, హాలీవుడ్ ఆర్భాటం లేకుండా, పూర్తిగా ఇండియన్ స్టైల్‌లో, భారీ హంగామాతో ఈవెంట్ చేయబోతున్నారని అర్థమవుతోంది.
ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు ముందే, ట్విట్టర్‌లో మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఫన్నీ ట్వీట్ వార్ నడిచింది. "నవంబర్ వచ్చేసింది, అప్‌డేట్ ఎక్కడ?" అని మహేష్ నిలదీయడం, "మీరు నవంబర్ మాట ఇచ్చారు, నిలబెట్టుకోండి" అని గుర్తుచేయడం.. ఆ తర్వాత జక్కన్న కాస్టింగ్ లీక్స్ గురించి ఫన్నీగా కోప్పడటం.. ఇదంతా ఈ పెద్ద అనౌన్స్‌మెంట్‌కు పర్ఫెక్ట్ లీడ్ లా పనిచేసింది.
ఫైనల్ గా, 'గ్లోబ్‌ట్రాటర్' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లు, ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ ఫీవర్‌ను వాడుకుంటూ మొదలయ్యాయి. సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టే, అనౌన్స్‌మెంట్ కూడా ఇండియా మొత్తం మాట్లాడుకునేలా ప్లాన్ చేశారు. నవంబర్ 15న రాబోయే ఆ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
