Begin typing your search above and press return to search.

గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్.. ఎవరెవరు వస్తున్నారు..?

ఐతే ఈ గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ కి కేవలం ఆ సినిమా యూనిట్ మాత్రమే వస్తుందా ఎవరైనా స్పెషల్ గెస్ట్ లు వస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

By:  Ramesh Boddu   |   15 Nov 2025 9:21 AM IST
గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్.. ఎవరెవరు వస్తున్నారు..?
X

ఈరోజు సాయంత్రం జరగబోతున్న గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ పనులన్నీ దాదాపు పూర్తైనట్టే అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి పాస్ పోర్ట్స్ విత్ రూట్ గైడెన్స్ తో వారికి ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా ఏర్పాటు చేసిన విధానం ఆ పాస్ పోర్ట్ బుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజమౌళి ప్లానింగ్ గురించి మరోసారి అందరు వారెవా అనేస్తున్నారు. రాజమౌళితో పాటు మహేష్ కూడా గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ కి పాస్ లు ఉన్నవారు మాత్రమే రండి లేకపోతే మాత్రం వద్దని చెబుతున్నారు.

సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పాలని..

ఐతే గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ ని ఇంత భారీగా ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వని జక్కన్న ఒక భారీ ఈవెంట్ లో ఈ సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా ఈవెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా పోస్టర్స్ తో పాటు సంచారి సాంగ్ కూడా సెన్సేషన్ అయ్యింది.

ఇక ఈరోజు ఈవెనింగ్ ఈవెంట్ లో మహేష్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారని టాక్. ఐతే ఈ గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ కి కేవలం ఆ సినిమా యూనిట్ మాత్రమే వస్తుందా ఎవరైనా స్పెషల్ గెస్ట్ లు వస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. గ్లోబ్ త్రొట్టర్ సినిమా ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న సినిమాగా ఇది రాబోతుంది కాబట్టి టాలీవుడ్ నుంచి డైరెక్టర్స్ కొందరు ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అందులో రాజమౌళి గురువు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.

తెలుగు సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమా..

ఆయనతో పాటు ఆర్జీవి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ ఈవెంట్ కి హాలీవుడ్ డైరెక్టర్స్, టెక్నిషియన్స్ కూడా వస్తారన్న టాక్ అయితే ఉంది. ఐతే అందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది ఈవెనింగ్ తెలుస్తుంది. మొత్తానికి గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ తో తను తీసేది తెలుగు సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమా అని ఈ వేడుక దాకా మొదటి హెచ్చరిక జారీ చేయనున్నాడు రాజమౌళి.

గ్లోబ్ త్రొట్టర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వగా నేడు రిలీజ్ అవబోతున్న మహేష్ లుక్ తో పాటు రిలీజ్ అవబోతున్న గ్లింప్స్ కూడా నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేస్తాయని చెప్పొచ్చు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా సక్సెస్ చేయాలని ఫిక్స్ అయ్యారు.