Begin typing your search above and press return to search.

'గ్లోబ్ ట్రాటర్' థీమ్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..

ఈ పాటకు సింగర్‌ను ఎంచుకోవడంలోనే జక్కన్న, కీరవాణిల 'మాస్టర్‌స్ట్రోక్' కనిపిస్తుంది. ఈ పాటను పాడింది మల్టీ టాలెంటెడ్ శ్రుతి హాసన్

By:  M Prashanth   |   10 Nov 2025 7:58 PM IST
గ్లోబ్ ట్రాటర్ థీమ్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..
X

రాజమౌళి మహేష్ బాబు SSMB29.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఇండియా మొత్తం తిరుగుతోంది. నవంబర్ 15న "గ్లోబ్ ట్రాటర్" పేరుతో జరగబోయే ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్‌కు హైప్ తేవడంలో జక్కన్న స్కెచ్ మామూలుగా లేదు. మొన్న విలన్ 'కుంభ' (పృథ్వీరాజ్) ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో మంచి హైపై క్రియేట్ చేశాడు. ఇప్పుడు, ఆ హీట్ తగ్గకముందే, సినిమా మ్యూజికల్ సోల్‌ను బయటకు వదిలాడు. 'గ్లోబ్ ట్రాటర్' అనే సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాలకే వైబ్ క్రియేట్ చేసింది.

ఈ పాట విన్న సెకన్ నుంచి ఒక్కటి మాత్రం క్లియర్.. ఇది రెగ్యులర్ తెలుగు సినిమా పాట కాదని చెప్పవచ్చు. ఇది ఒక మూవీ 'థీమ్' అని చెప్పవచ్చు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాట.. సినిమా జానర్ ఏంటో, దాని స్కేల్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పేసింది. ఇది 'బాహుబలి' ఎమోషన్ కాదు, 'RRR' మాస్ కాదు.. ఇది పక్కా హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉన్న ఒక గ్లోబల్ అడ్వెంచర్ థీమ్. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్, ఆ ట్రెజర్ హంట్ వైబ్‌కు కీరవాణి తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు.

ఈ పాటకు సింగర్‌ను ఎంచుకోవడంలోనే జక్కన్న, కీరవాణిల 'మాస్టర్‌స్ట్రోక్' కనిపిస్తుంది. ఈ పాటను పాడింది మల్టీ టాలెంటెడ్ శ్రుతి హాసన్. ఒక మెలోడీ వాయిస్ కాకుండా, కాస్త హస్కీగా, పవర్‌ఫుల్‌గా, వెస్ట్రన్ పాప్ సింగర్‌లా ఉండే శ్రుతి వాయిస్‌ను వాడటం అనేది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది తెలుగు పాటలా కాదు, ఒక ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ఫిల్మ్ యాంథమ్‌లా వినిపిస్తోంది. శ్రుతి వాయిస్‌లోని ఆ ఇంటెన్సిటీ, ఆ "సంచారీ... సంచారీ" అని పలికిన విధానం.. పాట మూడ్‌ను సెట్ చేశాయి.

ఇక చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్.. మహేష్ బాబు క్యారెక్టర్‌ను హైలెట్ చేస్తున్నాయి. "కాలాన్ని శాసిస్తూ.. ప్రతిరోజూ పరుగేలే", "వేగాన్నే శ్వాసిస్తూ.." వంటి లైన్లు.. ఈ 'గ్లోబ్ ట్రాటర్' (ప్రపంచ సంచారి) టైమ్‌తో రేస్ పెట్టుకున్నాడని, గ్లోబ్‌ను చుట్టేసే ఒక ఫియర్‌లెస్ అడ్వెంచరర్ అని క్లారిటీ ఇచ్చేశాయి. అలాగే క్యారెక్టర్‌లో గ్రే షేడ్స్ కూడా ఉన్నాయా అనే క్యూరియాసిటీని పెంచుతోంది.

ఓవరాల్‌గా, సినిమా ఇదివరకెన్నడూ చూడని ఒక గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని ఈ థీమ్ సాంగ్ గట్టిగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ పాటతో నవంబర్ 15న జరగబోయే ఈవెంట్‌పై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లాయి. జక్కన్న మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే.