Begin typing your search above and press return to search.

గ్లింప్స్ ఈవెంట్ తోనే రికార్డు కొట్టనున్న మహేష్- జక్కన్న

అందరూ పాటలకు, ట్రైలర్ కు, ప్రీ రిలీజ్ కు ఈవెంట్ నిర్వహిస్తే.. జక్కన్న ఏకంగా ఇందులో టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేసేందుకే ఈవెంట్ ప్లాన్ చేశారు.

By:  M Prashanth   |   8 Nov 2025 3:49 PM IST
గ్లింప్స్ ఈవెంట్ తోనే రికార్డు కొట్టనున్న మహేష్- జక్కన్న
X

సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చంతా సూపర్ స్టార్ మహేష్- దర్శకధీరుడు రాజమౌళి SSMB సినిమాపైనే ఉంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అప్డేట్లు పంచుకోని డైరెక్టర్ జక్కన్న ఈ నెలలో భారీ ఈవెంట్ ప్లాన్ చేయడంతో సినీ ప్రియుల చూపంతా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వైపే మళ్లింది. అందులోనూ నిన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ఇండస్ట్రీ చూపంతా తన వైపునకు తిప్పుకున్నారు. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజమౌళి తన సినిమాను అందరిలా కాకుండా భిన్నంగా చూపించాలనుకుంటారు. ప్రమోషన్స్ లోనూ డిఫరెండ్ చూపింస్తారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నారు. అందరూ పాటలకు, ట్రైలర్ కు, ప్రీ రిలీజ్ కు ఈవెంట్ నిర్వహిస్తే.. జక్కన్న ఏకంగా ఇందులో టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేసేందుకే ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇది ఈ నెల 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లోనే గ్రాండ్ గా జరగనుంది.

ఈ ఈవెంట్ కోసం భారీ సెటప్ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందులో గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పనులు ప్రారంభమైపోయాయి. వేడుకకు 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తైన భారీ ప్లాట్ ఫామ్ సిద్ధం చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఈ రేంజ్ లో ఈవెంట్ స్టేజ్ సెట్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘనత కూడా జక్కన్నకే దక్కనుంది. ఈ సెటప్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా కానుంది. ఇది కూడా ఒక రకమైన రికార్డే కానుంది. ఓ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ అవ్వడం తొలిసారి. అయితే రాజమౌళి ఇప్పటికే అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ నవంబర్ లో భారీ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పారంటే, చేస్తారంతే అనే నమ్మకం ఫ్యాన్స్ లో కూడా ఉంది. నిన్న పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ పోస్టర్ చూస్తేనే ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. తెలుగులో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ను చూపించననున్నాడు. ఇక రానున్న వారంలో కూడా మరికొన్ని అప్డేట్ల్లు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మూవీటీమ్ క్లైమాక్స్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది. హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్ వచ్చేసింది. కీలక పాత్రలపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ గా ఇది పాన్ వరల్డ్ రేంజ్ రానుంది.