SSMB29: ఫస్ట్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్ ఇదే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
By: M Prashanth | 22 Oct 2025 10:25 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ మూవీ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో ఓ ఊపు ఊపేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన పుష్ప-2.. అనేక రికార్డులు క్రియేట్ చేసింది.
సినిమా మొదలైన నుంచి రిలీజ్ అయిన వరకు వివిధ రికార్డులు క్రియేట్ అయ్యాయి. అందులో ఒకటి ప్రమోషనల్ పోస్ట్ రికార్డు. చాలా నెలల క్రితం పుష్ప-2 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అందరినీ ఆకట్టుకుని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది.
అంతే కాదు.. ట్విట్టర్ (ఎక్స్ )లో ఏకంగా 285 వేల లైక్స్ తో పాటు 14 మిలియన్ల ఇంప్రెషన్లను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక రీచ్ కలిగిన పోస్ట్ గా పుష్ప-2 మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఆ రికార్డును ఇంకా ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. అనేక చిత్రాలు రిలీజైనా అది మాత్రం సాధ్యం కాలేదు.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న SSMB 29 మూవీ.. కచ్చితంగా బ్రేక్ చేసే అవకాశం ఉందని అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో థ్రిల్లర్ గా సినిమా ప్రస్తుతం గ్రాండ్ గా రూపొందుతోంది.
ఇప్పటికే పలు షూటింగ్ షెడ్యూళ్లు కంప్లీట్ అవ్వగా.. వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి బిగ్ అప్డేట్ ఇవ్వని రాజమౌళి.. నవంబర్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తానని ఇటీవల ప్రకటించారు. మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ ను రివీల్ చేసి అనౌన్స్ చేశారు.
అయితే అవతార్: ద ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ కోసం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నవంబర్ నెలలో ఇండియాకు రానుండగా.. ఆయన చేత జక్కన్న మహేష్ మూవీ లుక్ రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసి ఇంటర్నేషనల్ రేంజ్ లో సినిమా రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
అలా నవంబర్ లో ఫస్ట్ లుక్ రివీల్ చేసే ప్రమోషనల్ పోస్ట్.. పుష్ప-2 రికార్డును బద్దలు కొడుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రమోషన్స్ ప్లాన్ చేసే జక్కన్న.. ఇప్పుడు ఫస్ట్ లుక్ విషయంలో అదే చేస్తే పుష్ప-2 మ్యాసివ్ రికార్డు బద్దలవడం ఖాయం. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
