మహేష్ VS అల్లు అర్జున్.. ఇద్దరి టార్గెట్ అదే..!
ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ అయితే తమ సినిమాలతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
By: Ramesh Boddu | 30 Aug 2025 10:08 AM ISTకొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఫిక్స్ అయ్యి రంగంలోకి దిగుతున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్న మన హీరోలు ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. ఐతే ఈసారి దాన్ని మార్చేలా తమ సినిమా ఉండాలని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ అయితే తమ సినిమాలతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు రాజమౌళితో.. అల్లు అర్జున్ అట్లీతో..
ఇంతకీ ఎవరా హీరో అంటే ఒకరు సూపర్ స్టార్ మహేష్ కాగా.. మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే మామూలుగానే ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఫోకస్ లో పడుతుంది. ఇప్పుడు ఆయన మహేష్ తో చేస్తున్న సినిమా పై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మరోపక్క అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు. ఐతే అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రాజెక్ట్ తో వస్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు కూడా ఇండియన్ సూపర్ హీరో సినిమా తరహాలో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది.
2027 రిలీజ్ టార్గెట్..
మహేష్, అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాలు రెండు కూడా 2027 రిలీజ్ టార్గెట్ తో వస్తున్నాయి. ఈ సినిమాల విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అంతేకాదు మహేష్, అల్లు అర్జున్ ఈ సినిమాలను 2027 సమ్మర్ కే వచ్చేలా చూస్తున్నారట. రెండు సినిమాలు ఒకే సీజన్ లో వస్తే మాత్రం టఫ్ ఫైట్ కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు.
మహేష్ బాబు రాజమౌళి సినిమాతో.. అల్లు అర్జున్ అట్లీ మూవీతో ఇద్దరు కూడా గ్లోబల్ లెవెల్ లో తమ మార్క్ చూపించాలని చూస్తున్న్నారు. రాజమౌళి తో సినిమా అంటే SSMB 29 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమా కూడా అంతకుమించి అనిపించేలా ఉంది. మరి ఈ సినిమాల మధ్య ఈ క్రేజీ డిస్కషన్ రెండిటికి ప్లస్ అవుతున్నా ఏ సినిమా ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది. ఏది ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిస్తుంది అన్నది చూడాలి.
