పీసీతో మహేష్.. మాస్ మడత పెట్టేసే స్కెచ్..!
ఐతే ఈ అప్డేట్ తోనే సినిమా శాంపిల్ చూపిస్తాడట రాజమౌళి ఇదిలా ఉంటే లేటెస్ట్ గా S.S.R.M.B సినిమా కోసం ఒక మాస్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట.
By: Ramesh Boddu | 7 Oct 2025 12:24 PM ISTరాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. కెన్యాలోని టాంజానియా ఫారెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి నవంబర్ లో ఒక అప్డేట్ అదే ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. అది కూడా రాజమౌళి అండ్ టీం నుంచి కాకుండా సినిమాకు సంబంధం లేని ఒక నిర్మాత పోస్టర్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు. ఐతే నవంబర్ ఫస్ట్ వీక్ లోనే SSMB 29కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఉంటుందని తెలుస్తుంది.
గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి డాన్స్..
ఐతే ఈ అప్డేట్ తోనే సినిమా శాంపిల్ చూపిస్తాడట రాజమౌళి ఇదిలా ఉంటే లేటెస్ట్ గా S.S.R.M.B సినిమా కోసం ఒక మాస్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కీరవాణి ఆ సాంగ్ కంపోజిషన్ అయ్యిందట. గుంటూరు కారం సినిమాలో మహేష్ కుర్చీ మడతపెట్టి డాన్స్ చూశాక ఇన్నాళ్లు మహేష్ ని ఇలా అదరగొట్టడం చూడలేదు అనుకున్నారు. ఏకంగా మహేష్ ని లుంగీ విప్పించే షార్ట్ మీద నిలబెట్టేశాడు త్రివిక్రమ్.
ఇప్పుడు రాజమౌళి దాన్ని మించి మాస్ కే ఊర మాస్ అనిపించే సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడట. కీరవాణి రాజమౌళి కాంబినేషన్ గురించి తెలిసిందే. అందులోనూ RRR తో ఆస్కార్ గెలుచుకున్న తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి రాజమౌళి నెక్స్ట్ లెవెల్ స్కెచ్ వేస్తున్నాడు. మహేష్ ప్రియాంక చోప్రాతో ఒక మాస్ సాంగ్.. మాస్ ని మెప్పించే మడత పెట్టే సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం రామోజి ఫిల్మ్ సిటీలోనే ఒక భారీ సెట్ వేస్తున్నారట.
SSMB 29 సినిమాలో క్రేజీ సాంగ్..
కుర్చీ మడతపెట్టికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ తన డాన్స్ ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో గుర్తించిన మహేష్ ఇక మీదట సినిమాలో ఒక సాంగ్ డాన్స్ తో అదరగొట్టేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే SSMB 29 సినిమాలో కూడా మరో క్రేజీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. అసలే అక్కడ ఉంది నాటు రాజమౌళి.. సో మహేష్ తో తాను అనుకున్న విధంగా స్టెప్పు వచ్చే దాకా వదిలి పెట్టకపోవచ్చు. ఈ సాంగ్ కి రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడట. సో నాటు నాటు తర్వాత ఈ సాంగ్ కూడా అకడమీ అవార్డ్ రేంజ్ కి తీసుకెళ్తారా లేదా అన్నది చూడాలి.
మహేష్ కూడా రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ లుక్స్, యాక్టింగ్ అన్నీ కూడా టాప్ క్లాస్ గా ఉంటాయని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపిస్తారని చెప్పుకుంటున్నారు.
