మహేష్- జక్కన్న ఈవెంట్.. క్రేజీ అప్డేట్ ఇదే..
100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో భారీ డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 12 Nov 2025 9:40 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB 29 (వర్కింగ్ టైటిల్). గ్లోబ్ ట్రాటర్ గా మేకర్స్ ప్రమోట్ చేస్తున్న ఆ మూవీ బిగ్గెస్ట్ ఈవెంట్ కు సంబంధించి కొన్ని రోజులుగా నెట్టింట చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15వ తేదీన ఈవెంట్ జరగనుంది. ఆ రోజు సాయంత్రం ప్రారంభం కానుంది. ఈవెంట్ ను సాధారణ సినిమా కార్యక్రమంలా కాకుండా, ఒక చారిత్రక ఘట్టంగా మలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారట.
100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో భారీ డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు మేకర్స్.. మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు రానున్నారు. 50 వేల మందికి పైగా ఆడియన్స్ వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో ఈవెంట్ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆ విషయాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఈవెంట్ దుబాయ్ లోని స్టార్ సినిమాస్, అల్ ఘురైర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రీమియం డాల్బీ సినిమా స్క్రీన్ పై ప్రసారం అవుతుంది. అది కచ్చితంగా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
అయితే రీసెంట్ గా ఫారిన్ మూవీ లవర్స్.. చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎస్ఎస్ కార్తికేయను ఎంపిక చేసిన థియేటర్లలో ఈవెంట్ ను ప్రదర్శించమని అభ్యర్థించారు. దీంతో కార్తికేయ అప్పుడు.. ట్రై చేద్దామని తెలిపారు. ఒక 5-6 లోకేషన్లలో చూద్దామని తెలిపారు. అవకాశాలను చెక్ చేసి చెప్తా అని ఇటీవల నెట్టింట హామీ ఇచ్చారు.
అందులో భాగంగా ఇప్పుడు దుబాయ్ లో ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతే కాదు అమెరికా, కెనడా, యూకే సహా పలు దేశాల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏదేమైనా మేకర్స్ ప్లాన్స్ మాత్రం మామూలుగా లేవు. ఒక్కో అప్డేట్ తో సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈవెంట్ తో ఇంకే చేస్తారో అన్నది ఎవరూ ఊహించలేమేమో.
