బన్నీ వర్సెస్ మహేష్ నాన్ స్టాప్ ఫైట్!
రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం భారీ కాన్వాస్ పై తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో ఈ చిత్రం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.
By: Srikanth Kontham | 23 Oct 2025 5:00 PM IST`బాహుబలి 2` రికార్డులను `పుష్ప2` బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. `బాహుబలి ది కన్ క్లూజన్` 1810 కోట్లు సాధిస్తే? `పుష్ప 2` ఏకంగా 1870 కోట్ల వసూళ్లతో రికార్డును బ్రేక్ చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్ హీరోల బాక్సాఫీస్ రికార్డులను సైతం నార్త్ బెల్డ్ లో తిరగరాసిన చిత్రంగా నిలిచింది. మరి ఇప్పుడీ రికార్డులు కొట్టే ది ఎవరు? అంటే ఎస్ ఎస్ ఎంబీ 29 తో అది సాధ్యమవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం భారీ కాన్వాస్ పై తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో ఈ చిత్రం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.
రెండు చిత్రాల మధ్య క్లాష్ తప్పదా:
ఈ నేపథ్యంలో ఓపెనింగ్ సహా హిట్ టాక్ తెచ్చుకుంటే? 5000 కోట్లు సాధ్యమే అన్న మాట ఇప్పటికే జోరుగా వినిపిస్తుంది. అదే జరిగితే `పుష్ప2` విజయం లాంటి రెండు చిత్రాల రికార్డులు తిరగ రాసినట్లే. మరి అది జరుగుతుందో? లేదా? అన్నది రిలీజ్ తర్వాత సంగతి. అలాగే ఎస్ ఎస్ ఎస్ ఎంబీ 29 చిత్రం కూడా బన్నీ 22వ చిత్రంతో క్లాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రెండు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ 22వ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.
రెండు రకాల టార్గెట్లు:
అలాగే మహేష్ -రాజమౌళి సినిమాపై అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 2027లో రిలీజ్ సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే రెండు చిత్రాల మధ్య బిగ్ ఫైట్ తప్పదు. ఆ రెండింటిలో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది? అన్నది అంతకంతకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ సమయంలో ఎస్ ఎస్ ఎంబీ 29 పై రెండు రకాల టార్గెట్లు ఫిక్స్ నైట్లు చెప్పొచ్చు. ఒకటి `పుష్ప 2` రికార్డులతో పాటు, బన్నీ 22వ చిత్రంతో ధీటుగా పోటీ పడాలి. మరి ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి క్లాష్ తలెత్తుందో చూడాలి.
నేరుగా గ్లోబల్ మార్కెట్ పై:
రెండు చిత్రాలు గ్లోబల్ స్థాయి అప్పిరియన్స్ ఉన్నవే. ఇంటర్నేషనల్ మార్కెట్ కి కనెక్ట్ చేస్తూ రిలీజ్ ప్లానింగ్ జరుగుతోంది. పాన్ ఇండియాలో మహేష్ సినిమా చేయనప్పటికీ రాజమౌళి ఇమేజ్ తో ఇక్కడ మార్కెట్ పెద్ద విషయం కాదు. ఆయన బ్రాండ్ తో సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది. గొప్ప నటుడిగా ఎలాగూ మహేష్ కి పేరుంది. అందుకే ఆ ద్వయం నేరుగా గ్లోబల్ మార్కెట్ పై కన్నేసి బరిలోకి దిగుతుంది. ఇక బన్నీ పాన్ -అట్లీ పాన్ ఇండియాని దున్నేసిన ద్వయం కాబట్టి? వారి టార్గెట్ నేరుగా గ్లోబల్ స్థాయిలోనే కనిస్తోన్న సంగతి తెలిసిందే.
