మ్యూజిక్ కింగ్ జోస్యం… రాబోయే ప్రాజెక్ట్స్ పై గూస్ బంప్స్ తెప్పించే న్యూస్!
తన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎనర్జిటిక్ పాటలతో థియేటర్లను షేక్ చేసే థమన్, తాజాగా తన రాబోయే సినిమాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
By: Madhu Reddy | 8 Jun 2026 6:40 PM ISTటాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎనర్జిటిక్ పాటలతో థియేటర్లను షేక్ చేసే థమన్, తాజాగా తన రాబోయే సినిమాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన OG ఇండియా టూర్ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన థమన్.. తన చేతిలో ఉన్న లైనప్ గురించి చెబుతూ, రాబోయే సినిమాలు అన్నీ బ్లాక్‌బస్టర్లే అంటూ ఊహించని జోస్యం చెప్పారు.
అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్:
యువ హీరో అనీశ్ నటిస్తున్న 'ఇట్లు అర్జున' డెఫినిట్‌గా బ్లాక్‌బస్టర్ అవుతుందని థమన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'లెనిన్' పై థమన్ భీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారు. ఇక ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని, మ్యూజిక్ పరంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని హింట్ ఇచ్చారు.
వెంకటేష్ - త్రివిక్రమ్ మూవీలో ఫుల్ ఫన్:
ఇక విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాపై కూడా థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా థియేటర్లలో ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరూ ఊహించలేరని, ఎందుకంటే ఇందులో అంతలా ఫుల్ ఫన్ దాగి ఉందని చెప్పారు. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా పండగలా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
మెగాస్టార్, బాలయ్య సినిమాలకు నెక్స్ట్ లెవెల్:
ఇక మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న 'మెగా 158' చిత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని థమన్ అన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ 'NBK111' కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ కాబోతుందని చెప్పారు. ఈ పెద్ద సినిమాలన్నింటికీ కథలు చాలా బాగా కుదిరాయని, వాటికి తగ్గట్టే తన నుండి బెస్ట్ సాంగ్స్, మ్యూజిక్ రాబోతున్నాయని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
ఇవే కాకుండా వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు లాంటి మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా థమన్ ఖాతాలో ఉన్నాయి. "టాలీవుడ్‌కు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్.. మన ఇండస్ట్రీ మళ్ళీ గట్టిగా పుంజుకోబోతోంది" అంటూ థమన్ ఫుల్ జోష్‌లో కనిపించారు. ఇక మ్యూజిక్ కింగ్ అంత నమ్మకంగా చెప్తున్నారంటే, రాబోయే రోజుల్లో థియేటర్లలో థమన్ రీసౌండ్ గట్టిగానే వినిపించబోతోందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
