Begin typing your search above and press return to search.

'రాజా సాబ్'.. సౌండ్ ఎక్కడ?

ఎస్ఎస్. థమన్.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక బ్రాండ్. సినిమా రిలీజ్‌కు ఆరు నెలల ముందే ఆల్బమ్‌తో హడావిడి మొదలుపెట్టడం, ప్రతీ పాటను ఒక ఈవెంట్‌లా ప్రమోట్ చేయడం ఆయన స్టైల్.

By:  M Prashanth   |   8 Nov 2025 11:00 PM IST
రాజా సాబ్.. సౌండ్ ఎక్కడ?
X

ఎస్ఎస్. థమన్.. ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక బ్రాండ్. సినిమా రిలీజ్‌కు ఆరు నెలల ముందే ఆల్బమ్‌తో హడావిడి మొదలుపెట్టడం, ప్రతీ పాటను ఒక ఈవెంట్‌లా ప్రమోట్ చేయడం ఆయన స్టైల్. 'అల వైకుంఠపురములో' నుంచి రీసెంట్ బ్లాక్‌బస్టర్ల వరకు, మ్యూజికల్‌గా సినిమాకు ఫుల్ హైప్ తేవడంలో థమన్ కింగ్. కానీ, అలాంటి థమన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయాడు.

ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమా సంక్రాంతికి వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అంటే, సినిమా రిలీజ్‌కు కరెక్ట్‌గా రెండు నెలలు మాత్రమే టైమ్ ఉంది. ఇది ప్రభాస్ నుంచి వస్తున్న ఫుల్ ఎంటర్‌టైనర్. డైరెక్టర్ మారుతి. ఇలాంటి కాంబోకు, ముఖ్యంగా సంక్రాంతి లాంటి పెద్ద ఫెస్టివల్‌కు మ్యూజిక్ ఎంత ప్లస్ అవ్వాలో, ఆ సాంగ్స్ జనాల్లోకి ఎంతలా వెళ్లాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ, 'రాజా సాబ్' టీమ్ నుంచి ఆ సౌండే రావడం లేదు. ఇప్పటికే మేకర్స్ ఒక టీజర్, రీసెంట్‌గా ఒక ట్రైలర్‌ను కూడా వదిలారు. అవి ఫర్వాలేదనిపించాయి. కానీ, ఒక సినిమాకు అసలు బలం మ్యూజిక్. ఆ మ్యూజికల్ ప్రమోషన్లే ఇంకా స్టార్ట్ కాలేదు. కనీసం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. థమన్ లాంటి సుప్రీమ్ టాలెంట్ ఉన్న కంపోజర్ చేతిలో ఉండి కూడా, ఈ సైలెన్స్ ఏంటని ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

చిన్న హీరోల సినిమాలకు కూడా నెలల ముందే సాంగ్ లోడింగ్ అంటూ ట్వీట్లు వేసే థమన్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ విషయంలో ఇంత సైలెంట్‌గా ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది 'రాజా సాబ్' లాంటి భారీ స్కేల్ సినిమాకు అస్సలు మంచిది కాదు. అయితే ఒకేసారి స్టార్ట్ చేయాలని నిర్మాతల నుంచి ఏమైనా కండీషన్స్ వస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది.

ఏదేమైనా రిలీజ్‌కు రెండు నెలల టైమ్ పెట్టుకుని, ఇంకా ఫస్ట్ సింగిల్‌ను కూడా వదలకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఆల్బమ్ రెడీ అయిందా, లేదా? లేక ఇది ఏదైనా కొత్త రకం ప్రమోషనల్ స్ట్రాటజీనా? అనేది అర్థం కావట్లేదు. ప్రభాస్ లాంటి బ్యాంకబుల్ సూపర్ స్టార్ సినిమాకే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఇంత కష్టపడటం ఏంటని ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.

సంక్రాంతి రేసులో నిలవాలంటే, ఈపాటికే కనీసం రెండు మూడు చార్ట్‌బస్టర్లు జనాల ప్లే లిస్టుల్లో మోగిపోవాలి. కానీ, 'రాజా సాబ్' ఆల్బమ్ నుంచి జీరో సౌండ్ ఉంది. థమన్ ఇప్పటికైనా మేల్కొని, తన మార్క్ ప్రమోషన్లతో ఆల్బమ్‌ను జనాల్లోకి తీసుకెళ్లకపోతే.. ఈ సైలెన్స్ సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది.