అఖండ 2.. హైప్ ఎక్కించే పనుల్లో థమన్..!
తెర మీద బాలయ్య భారీ ఎలివేషన్స్ కు థమన్ మ్యూజిక్ విధ్వంసం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అందిస్తుంది.
By: Ramesh Boddu | 27 Nov 2025 12:58 PM ISTబాలకృష్ణ సినిమాలకు థమన్ మ్యూజిక్ అది రిపీటెడ్ గా కొనసాగుతుంది. తెర మీద బాలయ్య భారీ ఎలివేషన్స్ కు థమన్ మ్యూజిక్ విధ్వంసం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అందిస్తుంది. ఈమధ్య కాలంలో బాలయ్య చేస్తున్న ప్రతి సినిమాకు థమనే మ్యూజిక్ ఇవ్వడం అది కూడా ది బెస్ట్ ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఐతే అఖండ సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో బిజిఎం కి ఏకంగా స్పీకర్లు బ్లాస్ట్ అయ్యాయని ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు.
థమన్ లీక్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్..
అఖండ 2 కి కూడా ఆ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని తెలుస్తుంది. ఐతే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవబోతున్న అఖండ 2 సినిమా విషయంలో థమన్ ఇస్తున్న లీక్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుంది. లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో ఏం హై రా బాబు.. అంటూ అఖండ ఇంటర్వెల్ అని రాసుకొచ్చాడు. అంటే బోయపాటి శ్రీను మరోసారి అఖండ 2 ఇంటర్వెల్ తో గూస్ బంప్స్ స్టఫ్ ఇస్తున్నట్టు వెల్లడించాడు థమన్.
బోయపాటి సినిమా.. అది కూడా బాలయ్య హీరోగా చేస్తున్నాడు అంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఈ ఇద్దరికి తోడు థమన్ కూడా తోడవడం హైప్ మరింత పెరిగింది. ఈ ఇయర్ ఆల్రెడీ డాకు మహారాజ్ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ క్రేజీగా అనిపించింది. ఐతే అఖండ 2కి దానికి డబుల్ జోష్ ఇచ్చేలా మ్యూజిక్ ఉంటుందని తెలుస్తుంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టిన మేకర్స్ ఈసారి బాలయ్య మాస్ స్టామినా నేషనల్ వైడ్ గా చూపించాలని ఫిక్స్ అయ్యారు.
అఘోరాగా బాలయ్య పూనకాలు..
బాలకృష్ణ అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్య డ్యుయల్ రోల్ తో మరోసారి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతున్నాడు. ముఖ్యంగా అఘోరాగా బాలయ్య చేసే బీభత్సం ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమా అంటే చాలు థమన్ కూడా ఊగిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.
అఖండ 2 ఇంటర్వెల్ గురించి ఏం హైప్ రా బాబు అంటూ థమన్ చేసిన ఎక్స్ లో కామెంట్ నందమూరి ఫ్యాన్స్ కి సూపర్ హై ఇచ్చింది. మరి సినిమాపై థమన్ ఎక్కిస్తున్న ఈ హైప్ అంతా డబుల్ జోష్ ఇచ్చేలా సినిమా ఉంటుందేమో చూడాలి. బాలయ్య బాబు అఖండ 2 తర్వాత తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.
