Begin typing your search above and press return to search.

మెగా 158కి రెహ‌మాన్ వ‌ర్క్ చేయ‌డం లేదా?

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్ సినిమాల విష‌యంలో స్పీడు పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండానే మ‌రో మూవీకి రెడీ అయిపోతున్నారు.

By:  Ravindar Gorantla   |   6 March 2026 10:00 PM IST
మెగా 158కి రెహ‌మాన్ వ‌ర్క్ చేయ‌డం లేదా?
X

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్ సినిమాల విష‌యంలో స్పీడు పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండానే మ‌రో మూవీకి రెడీ అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగార్జున వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక్కో స్టార్ చేతిలో రెండు, మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్ప‌టికే ఓ మూవీని రిలీజ్ చేసి మ‌రో సినిమాని రిలీజ్‌కు రెడీ చేస్తూ మ‌రో క్రేజీ యాక్ష‌న్ డ్రామాకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సంక్రాంతికి హిట్ మెషీన్ అనిల్ రావిపూడితో క‌లిసి `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని ద‌క్కించుకుని సంక్రాంతి సినిమాల్లో విజేత‌గా నిలిచింది. వింటేజ్ చిరుని ప‌రిచ‌యం చేయ‌డం, అనిల్ మార్కు కామెడీని పండించ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి చిరుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఈ మూవీ త‌రువాత చిరు ప్ర‌స్తుతం సోషియో ఫాంట‌సీ డ్రామా `విశ్వంభ‌ర‌`లో న‌టిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం వీఎఫ్ ఎక్స్ ప‌నులు జరుపుకుంటోంది.

త్రిష‌, అషికా రంగ‌నాథ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి..బాబి డైరెక్ష‌న్‌లో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా చేయ‌బోతున్నారు. ప‌శ్చిమ బెంగాల్ నేప‌థ్యంలో సాగే పిరియాడిక్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా దీన్ని ద‌ర్శ‌కుడు బాబి తెర‌పైకి తీసుకురాబోతున్నాడు. మెగాస్టార్ న‌టించ‌నున్న 158వ సినిమా ఇది. గ‌తంలో వీరిద్దరి కాంబినేష‌న్‌లో `వాల్తేరు వీర‌య్య‌` మూవీ రూపొంది మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

దాని త‌రువాత మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ఓ భారీ మూవీకి శ్రీ‌కారం చుడుతున్నారు. విజ‌య్‌తో `జ‌న నాయ‌గ‌న్‌`, య‌ష్‌తో `టాక్సిక్‌` మూవీస్‌ని నిర్మించిన కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత వెంక‌ట్ కె. నారాయ‌ణ ఈ భారీ యాక్ష‌న్ డ్రామాని నిర్మించనున్నారు. మార్చి 14న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌బోతున్నారు. ఇప్ప‌టికే మేక‌ర్స్ ఏర్పాట్లు మొద‌లు పెట్టారు. తండ్రీ కూతుళ్ల నేప‌థ్యంలో సాగ్ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీని రూపొంద‌నున్న ఈ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఏ.ఆర్‌. రెహ‌మాన్‌ని తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

చాలా ఏళ్ల త‌రువాత రెహ‌మాన్ `పెద్ది` సినిమాకు సంగీతం అందించ‌డం, దాని పాట‌లు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో చిరు కూడా రెహ‌మాన్‌ని తీసుకోవాల‌నుకున్నార‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే బ‌డ్జెట్‌, త‌న కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సి వ‌స్తుంద‌నే కార‌ణాల‌తో రెహ‌మాన్‌కు బ‌దులుగా త‌మ‌న్‌ని మెగా టీమ్ ఎంచుకున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ విష‌యంలో త‌మ‌న్‌కు మంచి మార్కులు ప‌డుతున్న నేప‌థ్యంలో త‌నే అయితే బాగుంటుంద‌ని టీమ్ భావించి ఫైన‌ల్‌గా అత‌న్నే తీసుకున్నార‌ని తెలిసింది.