Begin typing your search above and press return to search.

'వారణాసి' టైటిల్ లో న్యూ ట్విస్ట్

మూవీలోని లీడ్ రోల్స్ లుక్స్ తో పాటు రీసెంట్ గా భారీ ఈవెంట్ ద్వారా టైటిల్ ను రివీల్ చేశారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే వారణాసి పేరును ప్రకటించారు. కానీ అప్పుడే అసలు చర్చ మొదలైంది.

By:  M Prashanth   |   29 Nov 2025 10:45 PM IST
వారణాసి టైటిల్ లో న్యూ ట్విస్ట్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గ్లోబల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు కంప్లీట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు కీలక సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ముందు చాలా సైలెంట్ గా పనికానిచ్చిన జక్కన్న.. కొన్ని రోజులుగా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. మూవీలోని లీడ్ రోల్స్ లుక్స్ తో పాటు రీసెంట్ గా భారీ ఈవెంట్ ద్వారా టైటిల్ ను రివీల్ చేశారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే వారణాసి పేరును ప్రకటించారు. కానీ అప్పుడే అసలు చర్చ మొదలైంది.

ఎందుకంటే వారణాసి టైటిల్ ను ఇప్పటికే మరో టాలీవుడ్ నిర్మాణ సంస్థ రామ‌భ‌క్త హ‌నుమ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ రిజిస్టర్ చేసుకుంది. యంగ్ హీరో ఆది సాయి కుమార్ తో రఫ్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సీ. హెచ్ సుబ్బారెడ్డి.. ఆ సినిమాను తీస్తున్నారు. దీంతో అదే పేరుతో రాజమౌళి ఎలా రిలీజ్ చేస్తారోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఆయన.. వారణాసి టైటిల్ పై చిన్న అక్షరాలతో ఇంగ్లీష్ లో ఎస్ ఎస్ రాజమౌళి స్ అని వేశారు.

దీంతో SS RAJAMOULI'S వారణాసి అనే టైటిల్ తో రిలీజ్ చేస్తారని కొందరు అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. తెలుగు టైటిల్‌ హక్కుల విషయంలో అలా గందరగోళం నెలకొనగా.. ఆ సందిగ్ధత తొలగినట్టుగా కనిపిస్తోంది. తెలుగులో రాజమౌళి వారణాసి అనే టైటిల్ తో సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం.

పాన్ వరల్డ్ రేంజ్ లో మిగతా భాషల్లో వారణాసి టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో ఆ విషయంపై సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని సమాచారం. తద్వారా తెలుగులో టైటిల్ పై ఎలాంటి ఇష్యూ రాకుండా రాజమౌళి ప్లాన్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. మహేష్ బాబు పవర్ ఫుల్ రోల్ రుద్రగా కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.