Varanasi: అనుకున్నట్లే 'వారణాసి'కి అసలు చిక్కు.. ఫిర్యాదు!
ఆ సినిమాకు కూడా 'వారణాసి' అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కే నిర్మిస్తున్నారు.
By: M Prashanth | 18 Nov 2025 3:46 PM IST'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరూ చూశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో లక్షలాది ఫ్యాన్స్ మధ్య 'వారణాసి' టైటిల్‌ను ప్రకటించి రాజమౌళి సంచలనం రేపారు. ఆ గ్రాండ్ విజువల్స్, మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ ఇంకా ఆ మ్యాజిక్‌లోనే ఉన్నారు. కానీ, ఆ ఈవెంట్ ముగిసి మూడు రోజులు గడవక ముందే, ఇప్పుడు అదే టైటిల్ జక్కన్న టీమ్‌ను పెద్ద చిక్కుల్లో పడేసింది.
Varanasi
మహేష్ బాబు సినిమాకు 'వారణాసి' అనే పేరు పెట్టడంపై ఇప్పుడు పెద్ద వివాదం మొదలైంది. అసలు ఈ టైటిల్‌పై రాజమౌళికి హక్కులు లేవంటూ మరో నిర్మాత తెరపైకి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టైటిల్ తమదంటే తమదని గొడవ మొదలైంది.
కొద్ది రోజుల క్రితమే, 'రఫ్' సినిమా డైరెక్టర్ సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా ప్రకటించారు. ఆ సినిమాకు కూడా 'వారణాసి' అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ కే నిర్మిస్తున్నారు. ఇప్పుడు అసలు సమస్య ఇక్కడే మొదలైంది.
లేటెస్ట్ గా, ఆ చిన్న సినిమా నిర్మాత విజయ్, రాజమౌళిపై ఫిల్మ్ ఛాంబర్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తాము దుర్గా ఆర్ట్స్ (రాజమౌళి సినిమా) కంటే ముందే 'వారణాసి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించామని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారంగా ఛాంబర్ నుంచి పొందిన లెటర్‌ను కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి ఆ టైటిల్‌ను ఎలా వాడుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
నిజానికి, రాజమౌళి తన సినిమా టైటిల్‌కు ముందు "ఎస్ ఎస్ రాజమౌళి'స్" అని పెట్టుకున్నారు. బహుశా చట్టపరమైన ఇబ్బందులు రాకుండానే ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ, ఈ వివాదం ఇంతటితో ఆగేలా లేదు. ఇదిలా ఉంటే, జక్కన్నకు మరో తలనొప్పి కూడా మొదలైంది.
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో ఆయన హనుమంతుడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు (టెక్నికల్ గ్లిచ్ రావడంతో) కూడా పెద్ద దుమారం రేపాయి. ఆయన మాటలతో మనోభావాలు దెబ్బతిన్నాయని 'రాష్ట్రీయ వానరసేన' సంఘం సభ్యులు రాజమౌళిపై మరో ఫిర్యాదు చేశారు. ఇలా ఒకేసారి టైటిల్ విషయంలో, మరోవైపు మాటల విషయంలో.. రాజమౌళి వరుస చిక్కుల్లో ఇరుక్కున్నారు. అయితే ఒక పెద్ద సినిమాకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలో ఇలాంటి వివాదాలు ఎన్ని వచ్చినా కూడా రాజమౌళి పెద్దగా పట్టించుకోలేదు. బహుశా ఈసారి కూడా అదే తరహాలో సైలెంట్ గా సాల్వ్ చేసుకునే అవకాశం ఉండవచ్చు.
