వారణాసిలో రామాయణం రాజమౌళి సంతృప్తి చెందేలా!
కానీ రాజమౌళి మాత్రం రామాయణంలోని పవర్, ఎమోషన్స్‌ను ఏమాత్రం తగ్గకుండా నేటి తరానికి కనెక్ట్ అయ్యే విధంగా అత్యంత గ్రాండియర్‌గా చూపించబోతున్నారు.
By: Srikanth Kontham | 17 Oct 2026 4:00 PM IST`రామాయణం` అంటే ఇతిహాసం మాత్రమే కాదు. కోట్ల భారతీయుల ఆత్మ. ఈ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరిం చాలనే కల చాలా మంది దర్శకులకు ఉంటుంది. కానీ సినిమా దిగ్గజం రాజమౌళి తనదైన విజువల్ గ్రాండియర్, ఎమోషనల్ డెప్త్‌తో `వారణాసి` ప్రాజెక్ట్ ను మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో పౌరాణిక చిత్రాలు.. యానిమేషన్ సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు కేవలం కథను చెప్పడానికే పరిమితమయ్యాయి.
కానీ రాజమౌళి మాత్రం రామాయణంలోని పవర్, ఎమోషన్స్‌ను ఏమాత్రం తగ్గకుండా నేటి తరానికి కనెక్ట్ అయ్యే విధంగా అత్యంత గ్రాండియర్‌గా చూపించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రామాయణ ఆధారిత చిత్రాలను రాజమౌళి పరిశీలించారు. ఆ సినిమాలన్నీ ప్రేక్షకులకు మోస్తరు సంతృప్తినిచ్చినా? తనలోని దర్శకుడిని మాత్రం పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాయని రాజమౌళి భావిస్తున్నారు. రామాయణంలో దాగి ఉన్న అసలైన శక్తిని.. పాత్రల మధ్య ఉండే మానసిక సంఘర్షణను, ఎమోషనల్ డెప్త్‌ను తెరపై పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేకపోయారనేది ఆయన అభిప్రాయంగా వ్యక్తమైంది.
రాజమౌళి ఎంచుకున్న పాయింట్ చాలా ప్రత్యేకమైనదిగా తెలుస్తోంది. రామాయణంలోని నిర్దిష్ట కోణాన్ని లేదా పాయింట్‌ను ఎంచుకుని దానికి వంద శాతం న్యాయం చేయాలనే గట్టి పట్టుదలతో `వారణాసి`కి కనెక్ట్ చేసినట్లు మాటల్లో కనిపిస్తుంది. ఎంచుకున్న కథాంశంతో రాముడి వ్యక్తిత్వాన్ని, ఆ కాలపు వాతావరణాన్ని, ధర్మబద్ధమైన పోరాటాలను అత్యంత సహజంగా..హృద్యంగా చూపించగలనన్న ఆత్మవిశ్వాసం జక్కన్న మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
రాజమౌళి సినిమాల్లో విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో ?`బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` చిత్రాలతో ప్రపంచానికి తెలిసింది. అదే స్థాయిలో `రామాయణం`లో తీసుకున్న పాయింట్ వరకూ తన ఫరిదిలో ఉన్నంత వరకూ పూర్తి న్యాయం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు జక్కన్న. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా? రామాయణ భక్తి భావాన్ని... శక్తిని ..రెప్ప వాల్చకుండా చూసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఒక సినిమాగా మాత్రమే కాకుండా భారతీయ చలనచిత్ర చరిత్రలో మరొక గర్వించదగ్గ మైలురాయిగా నిలవనుంది. జక్కన్న పట్టుదల.. ఆయన ఎంచుకున్న పాయింట్‌కు చేస్తున్న న్యాయం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయనడంలో సందేహం లేదు. రాజమౌళి చేతిలో `రామాయణం` ఏ స్థాయిలో రూపుది ద్దుకుంటుందో? చూడాలని యావత్ ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆనమ్మకంతో నే జక్కన్న ధైర్యంగా 120 దేశాల్లో `వారణాసి`ని రిలీజ్ చేయడానికి సంకల్పించారు.
