రాజమౌళి అప్సెట్ లో అలా అనేశాడే తప్ప..!
తెలుగు సినీ ప్రస్థానాన్ని ప్రపంచానికి తీసుకెళ్లిన దర్శకుడు మన రాజమౌళి. బాహుబలితో ఆయన మొదలు పెట్టిన పాన్ ఇండియా క్రేజ్ చాలా సినిమాలకు మార్గదర్శకం అయ్యింది.
By: Ramesh Boddu | 16 Nov 2025 9:21 AM ISTతెలుగు సినీ ప్రస్థానాన్ని ప్రపంచానికి తీసుకెళ్లిన దర్శకుడు మన రాజమౌళి. బాహుబలితో ఆయన మొదలు పెట్టిన పాన్ ఇండియా క్రేజ్ చాలా సినిమాలకు మార్గదర్శకం అయ్యింది. ఇక ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇంకా టైటిల్ రివీల్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఐతే ఈవెంట్ లో వేద్దామనుకున్న వారణాసి గ్లింప్స్ ని రిలీజ్ చేయడం కాస్త టైం పట్టింది.
వారణాసి ఈవెంట్ లో రాజమౌళి అప్సెట్..
100 ఫీట్ స్క్రీన్స్ పై ముందుగానే గ్లింప్స్ టెస్ట్ చేసుకోవాలని అనుకున్నా ఎక్కడ నుంచో కొన్ని డ్రోన్స్ వచ్చాయి. అందుకే టెస్టింగ్ చేయలేదని అన్నారు రాజమౌళి. ఐతే ఒకేసారి స్క్రీన్ పై వేయాలి అంటే దాదాపు 40 జెనరేటర్స్ పవర్ కావాలి. అయినా కూడా అది ఒకసారి ట్రై చేస్తే రాలేదు. దానివల్ల రాజమౌళి అప్సెట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన దేవుడంటే తనకు నమ్మకం లేదని అన్నాడు. నాన్న చెప్పినట్టు హనుమాన్ నా వెంట ఉంటే ఇలా అయ్యేది కాదని అన్నాడు.
అంతకుముందే రాజమౌళి తనకు రామాయణ, మహా భారత కథలు సినిమాలుగా చేయాలని ఉందని అన్నాడు. జస్ట్ ఆ గ్లింప్స్ అనుకున్న విధంగా స్క్రీన్స్ పై రాకపోవడంతో కాస్త అప్సెట్ అయ్యి దేవుడంటే నమ్మకం లేదని రాజమౌళి అన్నాడు. ఐతే ఈ మాటని పట్టుకుని రాజమౌళి మీద కొందరు నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వాళ్లు దేవుడు సినిమాలు ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు.
గ్లింప్స్ రావడం లేట్ అవ్వడం..
రాజమౌళి కూడా వారణాసి ఈవెంట్ లో కాస్త టెన్షన్ గానే కనిపించారు. ఈవెంట్ అంతా అనుకున్న విధంగా జరగాలనే ఉద్దేశ్యంతో టీం అంతటినీ మోనిటర్ చేస్తూ చేతిలో వాకీ టాకీ పెట్టుకుని మరీ రాజమౌళి ఈ ఈవెంట్ నిర్వహించారు. గ్లింప్స్ రావడం లేట్ అవ్వడం ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ అనిపించినా ఫైనల్ గా డబుల్ ఫీస్ట్ అందించేలా ఆ టీజర్ ఉండటం ఫ్యాన్స్ ని ఖుషి చేసింది.
సినిమాలో మహేష్ మొదటిసారి రాముడిగా గెటప్ వేసినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి చెప్పడం ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ మహేష్ ని రాముడిగా చూడబోతున్నామా అనే ఉత్సాహంతో కేకలు వేశారు. ఇక వారణాసి గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. రుద్ర, రాముడి పాత్రల్లో మహేష్ విశ్వరూపం చూపించనున్నాడు. రాజమౌళి మహేష్ వారణాసితో చాలా పెద్ద కథతోనే వస్తున్నారని అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా గ్లింప్స్ లో చూపించిన విజువల్స్ ఐతే తెర మీద ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అన్న రేంజ్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చాయి.
