Begin typing your search above and press return to search.

రాజ‌మౌళిలో కూడా వ‌ర్మ లాంటి వ్య‌క్తిత్వ‌మా!

రాంగోపాల్ వ‌ర్మ ఏ దేవుడికి దంణ్ణం పెట్ట‌డు. దేవుడు అనే వాడినే న‌మ్మ‌నంటాడు. న‌మ్మే వాళ్ల‌పై సెటైర్లు వేస్తాడు.

By:  Srikanth Kontham   |   18 Nov 2025 9:00 PM IST
రాజ‌మౌళిలో కూడా వ‌ర్మ లాంటి వ్య‌క్తిత్వ‌మా!
X

రాంగోపాల్ వ‌ర్మ ఏ దేవుడికి దంణ్ణం పెట్ట‌డు. దేవుడు అనే వాడినే న‌మ్మ‌నంటాడు. న‌మ్మే వాళ్ల‌పై సెటైర్లు వేస్తాడు. పూజ‌లు, పున‌స్కారాలు చేస్తే? ప్ర‌జ‌ల‌కు ఇదేం పిచ్చో అంటాడు. శివుడి మీద పాలు పొస్తే వాటిని శివుడొచ్చి తాగుతాడా? ఇదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేస్తాడు. ఏ వేదికపై నైనా వ‌ర్మ ఈ మాట గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌డు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వ‌ర్మ శిష్యుడు పూరి జ‌గ‌న్నాధ్ కూడా అంతే. దేవుడు..దెయ్యాలు ఉన్నాయంటే న‌మ్మ‌నంటాడు. మ‌రి అలాంట‌ప్పుడు సినిమా లాంచింగ్ రోజు కొబ్బ‌రికాయ ఎందుకు కొడ‌తారంటే? ప‌క్క‌నే ఉన్న వారి న‌మ్మ‌కం పోగొట్ట‌డం ఎందుక‌ని వాళ్ల సంతోషంగా కోస‌మే ఆ ప‌ని చేస్తాను త‌ప్ప త‌న కోసం కాద‌ని ఓపెన్ గా చెబుతాడు.

ప‌రిశ్ర‌మ‌లో ఇదే చ‌ర్చ‌:

జ‌గ‌ప‌తి బాబు కూడా దేవుళ్ల‌ను న‌మ్మ‌డు. త‌వ్వితే ఇలాంటి వాళ్లు ఇంకొంత మంది వ‌స్తారు. అయితే ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజ‌మౌళి కూడా దేవుడిని న‌మ్మ‌ను అని ప్ర‌క‌టించ‌డం ఇప్పుడంద‌రిలోనూ ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న దేవుడిని న‌మ్మ‌క‌పోవ‌డం ఏంటి? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌రిశ్ర‌మ స‌హా ప్రేక్ష‌కుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఓ ర‌కంగా చెప్పాలంటే దేవుడుని న‌మ్మే వాళ్లంతా రాజ‌మౌళిని విమ‌ర్శిస్తున్నారు కూడా. రామాయ‌ణం అంటే ఇష్ట‌మంటాడు. భ‌గ‌వ‌ద్గీత అంటే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు. ఖాళీ స‌మ‌యంలో వాటిని చ‌ద‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాడు.

షాక్ అయిన అభిమానులు:

ఇంకా దేవుళ్ల‌కు సంబంధించిన అన్ని గ్రంధాలు చ‌ద‌వ‌డానికి తానెప్పుడు సిద్ద‌మ‌నే అంటాడు. కానీ దేవుడిని మాత్రం న‌మ్మ‌నంటాడు. ఇదేం లాజిక్ అని చాలా మందిలో సందేహం ఉంది. దానికి స‌మాధానం ఆయ‌నే చెప్పాలి. కానీ దేవుడిని న‌మ్మ‌ను అనే స‌మాధానం తో రాజమౌళిలో కూడా బ‌య‌ట ప‌డ‌ని వ‌ర్మ లాంటి వ్య‌క్తిత్వం దాగి ఉందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత వ‌ర‌కూ రాజ‌మౌళి ఎక్క‌డా దేవుడు..అత‌డిపై ఉండే న‌మ్మ‌కాల గురించి మాట్లాడ‌లేదు. `వార‌ణాసి` సినిమా చేస్తోన్న స‌మ‌యంలోనూ అందులోనూ రామాయ‌ణంలో పాత్ర ఆధారంగా తీసుకుని చేస్తోన్న స‌మ‌యంలో దేవుడిని న‌మ్మ‌ను అన్న ప్ర‌క‌ట‌న‌? ఆయ‌న అభిమానుల్ని విస్మ‌యానికి గురి చేసేదే

స‌మ‌యం రాలేద‌నే దాచారా?

అయినా? ఇది న‌మ్మాల్సిన నిజం. ఇంత‌కాలం స‌మ‌యం రాలేదు కాబ‌ట్టి జ‌క్క‌న్న ఆ మాట ఎక్క‌డ వ‌ద‌ల్లేదు. లేదంటే? ఆ మాట ఎప్పుడో చెప్పేవాడేమో. దీంతో రాజ‌మౌళి కూడా వ‌ర్మలా వీలైనంత వాస్త‌వంలోనే జీవిస్తాడు ? అన్న‌ది దేవుడ‌ని న‌మ్మ‌ని వాళ్ల అభిప్రాయంగా చెబుతున్నారు. న‌మ్మ‌డం..న‌మ్మ‌క‌పోవడం అన్న‌ది వ్య‌క్తిగ‌త‌మైన విష‌యం. ఆ విష‌యాన్ని ప‌బ్లిక్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంత‌కాలం రాజ‌మౌళి చేసింది అదేనంటూ ఓ వ‌ర్గం వాదిస్తోంది.