Begin typing your search above and press return to search.

ఎవరొచ్చినా.. ఎన్ని సాధించినా.. ఈ దర్శకుడే టాప్?

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   31 March 2026 10:51 AM IST
ఎవరొచ్చినా.. ఎన్ని సాధించినా.. ఈ దర్శకుడే టాప్?
X

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. ఆయన స్టోరీ నెరేషన్, బాక్సాఫీస్ కలెక్షన్లు, టెక్నాలజీ గురించి నెటిజన్లు మరోసారి చర్చిస్తున్నారు. ఎవరొచ్చినా.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా.. రాజమౌళినే టాప్ అంటూ అభిమానులు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ప్రాంతీయ స్థాయిలోనే పరిమితమై ఉండేది. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ సినిమాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఆ సినిమాలు భారతీయ సినిమా చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించాయి. కేవలం వసూళ్ల పరంగానే కాదు, విజువల్స్, కథన నిర్మాణం, ఎమోషన్.. అన్నీ కలిపి ప్రపంచ స్థాయి అనుభూతిని ప్రేక్షకులకు అందించాయి.

ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అయితే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ మూవీ ద్వారా ఆస్కార్ అవార్డు రావడం భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. దీంతో రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో మరింత గట్టిగా వినపడింది. ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి మూవీపై ఇప్పటికే అందరిలో ఆసక్తి పెరిగింది. ఆ సినిమా కూడా మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొన్ని సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ, కేవలం కలెక్షన్లు మాత్రమే గొప్పతనానికి ప్రమాణం కాదని సినీ ప్రియులు అంటున్నారు.

సినిమా ఎక్స్పీరియన్స్, కథనం, ఎమోషనల్ డెప్త్, విజువల్ గ్రాండియర్.. అన్ని విధాలుగా చూస్తే రాజమౌళి సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. రికార్డులు ఎవరు అయినా బద్దలు కొట్టొచ్చు. కానీ ప్రేక్షకుడికి థియేటర్‌ లో కలిగే అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లడం మాత్రం రాజమౌళికే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయన సినిమాల్లో కనిపించే డీటైలింగ్, సాంకేతిక నైపుణ్యం, ప్రతి సీన్‌ పై ఉండే శ్రద్ధ.. ఇవన్నీ ఆయనను ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టాయని అభిమానులు చెబుతున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రాజమౌళి సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆయన సినిమాలు ఒక బ్రాండ్‌ గా మారిపోయాయి. మొత్తానికి, కొత్త దర్శకులు వస్తున్నా, భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నా, బాక్సాఫీస్ రికార్డులు మారుతున్నా.. సినిమా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడంలో రాజమౌళి ఇంకా ముందంజలోనే ఉన్నారని నెటిజన్లు భావిస్తున్నారు. అందుకే జక్కన్నకు జక్కన్నే సాటి అన్న మాట మరోసారి వినిపిస్తోంది.