"అమ్మా అమ్మా.. ఆయన రాజమౌళి.. అలా నెట్టేస్తే ఎలా?"
అయితే ఆ ఈవెంట్ బ్యాక్‌స్టేజ్ వద్ద రాజమౌళిని ఆయన సతీమణి రమా రాజమౌళి వేదిక వైపు వెళ్లమని "నడు" అంటూ సరదాగా ముందుకు తోశారు.
By: M Prashanth | 30 Sept 2026 3:17 PM ISTబాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఎస్.ఎస్. రాజమౌళి సెట్‌లో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆయనకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొడుకు కార్తికేయ నిర్మించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ బ్యాక్‌స్టేజ్ వద్ద రాజమౌళిని ఆయన సతీమణి రమా రాజమౌళి వేదిక వైపు వెళ్లమని "నడు" అంటూ సరదాగా ముందుకు తోశారు.
దీన్ని చూసిన నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోపై జనాలు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. పవర్ ఆఫ్ హోం మినిస్టర్ అనే ట్యాగ్ పర్ఫెక్ట్ అని నవ్వుతున్నారు. "అమ్మ అమ్మా.. ఆయన బాహుబలి, RRR డైరెక్టరమ్మా.. అలా నెట్టేస్తే ఎలా? కాస్త చూసుకోండమ్మా" అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచాన్ని శాసించే దర్శకుడైనా సరే, ఇంట్లో భార్య ముందు సాధారణ భర్తే అంటూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
రాజమౌళి సైతం ఏమాత్రం ఇగో లేకుండా చిరునవ్వుతో వేదిక వైపు నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి గుర్తింపు ఉన్నా, కెమెరా వెనుక ఆయన ప్రవర్తన చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈవెంట్లలో గానీ, పబ్లిక్ ఫంక్షన్లలో గానీ ఆయన ఎప్పుడూ తన స్టార్‌డమ్‌ను తలకెక్కించుకున్నట్లు ఎక్కడా కనిపించరు. సెట్‌లో ఆయన క్రియేటివ్ మాన్‌స్టర్ అయినా, ఇంట్లో మాత్రం ఒక సాధారణ కుటుంబ సభ్యుడిగానే మెలుగుతారని వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
ఇప్పుడు బయటపడిన ఈ ఫన్నీ వీడియో కూడా ఆ విషయాన్నే మరోసారి జనాలకు గుర్తు చేస్తోంది. ఇక రాజమౌళి సినిమాల విషయంలో ఆయన కుటుంబ సభ్యులే మొదటి విమర్శకులుగా ఉంటారన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. రమా రాజమౌళి కూడా గత ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించారు. జక్కన్న ఏదైనా ఒక సీన్ రాసినప్పుడు లేదా తీసినప్పుడు, అది బాగోలేకపోతే మొహం మీదే నిర్మొహమాటంగా చెప్పేస్తామని ఆమె వెల్లడించారు.
కథల ఎంపిక నుంచి కాస్ట్యూమ్స్ వరకు ఇంట్లో జరిగే చర్చలు చాలా సీరియస్ గా ఉంటాయని ఆమె పలుమార్లు చెప్పారు. ఒక పక్క భార్యగా ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూనే, మరోపక్క సినిమా సెట్‌లో రాజమౌళికి రమా ఎంతో అండగా నిలుస్తుంటారు. ఆయన సినిమాలకు స్టైలిస్ట్‌గా పని చేస్తూనే, క్రియేటివ్ నిర్ణయాల్లో కూడా తన వంతు సూచనలు ఇస్తుంటారు.
ఇంతటి సాన్నిహిత్యం, స్వేచ్ఛ ఉండబట్టే ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అంత పెద్ద దర్శకుడిని భుజం మీద చేయి వేసి ముందుకు నడవమని ఆమె ఆదేశించగలిగారు. ఆ చనువు వెనుక ఉన్న అనుబంధం ఆప్యాయత ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా పాన్ ఇండియా స్టార్లతో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే రాజమౌళి, తన హోం మినిస్టర్ ఆర్డర్‌ను మాత్రం సైలెంట్‌గా ఫాలో అయిపోవడం ఫ్యాన్స్‌కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది.
