అసభ్యతలేని అద్భుతం ఆయనకే సొంతం!
సాధారణంగా పాన్ ఇండియా సినిమాలంటే రొమాంటిక్ పెర్పార్మెన్స్ కు ఛాన్స్ తీసుకోవడానికి కొంత వర కైనా అవకాశం ఉంటుంది.
By: Srikanth Kontham | 6 Aug 2025 12:00 AM ISTసినిమా అంటే నవరసాల సమ్మేళనం. శృంగారం, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానకం, భీభత్సం , అద్భు త, శాంతరసాలే ఏ కథకైనా ప్రామాణికం. వాటి ఆధారంగానే కథలు పురుడు పోసుకుంటాయి. అయితే నిబంధనలన్నీ తూచ తప్పకుండా పాటించాలని లేదు. కథ అవసరానికి తగ్గట్టు కొన్ని రకాల రసాలనే క్రోడీకరించుకుంటారు. వాటి ఆధారంగానే అంతిమంగా ఓ కథను సిద్దం చేస్తారు. అయితే కథను కమర్శి యల్ గా కనెక్ట్ చేయడం కోసం రొమాన్స్ అనేది చాలా మంది దర్శకులు కీలకంగా భావిస్తారు.
నాటి నుంచి నేటి వరకూ అదే తీరు:
నాటి-మేటి దర్శకుల్లో ఈ అంశం చాలా వరకూ కనిపిస్తుంది. ఏ రసం ఉన్నా? లేకపోయినా? రొమాన్స్ అ న్నది ఓ వెపన్ లా వాడుతుంటారు. కానీ దర్శక శిఖరం రాజమౌళి మాత్రం రొమాన్స్ అనే అంశానికి ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వరు అన్నది అంతే వాస్తవం. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. 'స్టూడెంట్ నెంబవర్ వన్' నుంచి మొన్నటి 'ఆర్ ఆర్ ఆర్' వరకూ ఏ సినిమాలోనూ రొమాన్స్ అనే అంశానికి ఏనాడు చోటివ్వలేదు.
ఆ ఛాన్స్ మాత్రం తీసుకోరు:
ఎంతో మంది నాయికలు...మరెంతో మంది నటీమణులు ఆయన సినిమాల్లో భాగమవుతుంటారు. వంద లాది మహిళలు బ్యాకెండ్ లో కనిపిస్తారు. సన్నివేశం అయినా, పాటైనా...రొమాంటిక్ సన్నివేశం డిమాండ్ చేసినా? ఆ లిబర్టీని మాత్రం తీసుకోరు. పాత్రలు, నటన లో సహజత్వంతోనే కథను ముందుకు నడిపిం చడమన్నది అయనకు కొట్టిన పిండి. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాలు పాన్ ఇండియాలో సక్సెస్ అయిన నేపథ్యంలో రొమాన్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఇంటర్నేషనల్ అయినా అదే తీరు:
సాధారణంగా పాన్ ఇండియా సినిమాలంటే రొమాంటిక్ పెర్పార్మెన్స్ కు ఛాన్స్ తీసుకోవడానికి కొంత వర కైనా అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఒత్తిడిలు ఇక్కడ డిమాండ్ చేస్తుంటాయి. అంతర్జాతీయంగానూ ఆ కథలను కనెక్ట్ చేయాలంటే రొమాన్స్ కీలకమనే అంశాన్ని రైటర్లు లేవనెత్తుతుంటారు. కానీ ఇక్కడ కూడా రాజమౌళి ఆ ఛాన్స్ తీసుకోకుండా తన మార్క్ లోనే సినిమాలు చేయడం విశేషం. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' లాంటి చిత్రాలకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపు తెలిసిందే.
ప్రియాంకని మార్చేస్తాడా:
వాటిలో ఎలాంటి రొమాన్స్ లేకుండానే? ఇంటర్నేషనల్ మార్కెట్ కి కనెక్ట్ చేసారు. నాటు నాటు పాటతో ఆస్కార్ సైతం అందుకుని జాతీయ జెండాను రెప రెపలాడించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ కి జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. పీసీ ఇంటర్నేషనల్ అప్పిరియన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సీన్ డిమాండ్ చేసిందంటే? పకడ సన్నివేశాలకు ఏమాత్రం వెనకడుగు వేయదు. వాటిలో హీరోని సైతం డామి నేట్ చేస్తుంది. 'క్వాంటికో' లాంటి సిరీస్ లో కారు రొమాన్సే అందుకు చక్కటి ఉదాహరణ. అలాంటి నటితో రాజమౌళి పని చేస్తున్నారు. అంతటి పీసీని సైతం రాజమౌళి మార్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు సుమీ.
