రాజమౌళి - తారక్ మూవీకి లైన్ క్లియర్ అయినట్లేనా?
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Nov 2025 3:43 PM ISTటాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారి కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు.. ఆడియన్స్ ను విపరీతంగా అలరించాయి.
అయితే రాజమౌళి, తారక్ కాంబినేషన్ లో మరో మూవీ రానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే జక్కన్న నిర్మించనున్న సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ మేడ్ ఇన్ ఇండియాలో ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తున్నారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
అదే సమయంలో అటు ఎన్టీఆర్, ఇటు రాజమౌళి వార్తలను ఖండించలేదు. దీంతో దాదాసాహెబ్ గా ఎన్టీఆర్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అనేక మంది ఫిక్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ను మేకర్స్ హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కారణం తెలియకపోయినా తాత్కాలికంగా నిలిచినట్లు టాక్ వచ్చింది.
తారక్ లైనప్ లో అనేక సినిమాలు ఉండడం వల్ల ప్రాజెక్టు హోల్డ్ లోకి వెళ్లిందని కూడా టాక్ వినిపించింది. అయితే ఫాల్కే బయోపిక్ ను రాజమౌళితో పాటు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా తీస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో నటిస్తారని ఇప్పటికే తెలిసింది.
దీంతో బాలీవుడ్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు వాయిదా పడినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో అమిర్ కొన్ని చేంజెస్ అడిగారని.. అందుకు మేకర్స్ సిద్ధంగా లేరని సమాచారం. అలా ఆ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. హిరాణీ, అమీర్.. ప్రస్తుతం తమ కొత్త మూవీలతో బిజీ అయిపోయారట.
అందుకే రాజమౌళి- తారక్ మూవీకి లైన్ క్లియర్ అయినట్లేనని అంతా అంటున్నారు. ఎందుకంటే ఒకే అంశంపై రెండు సినిమాలు వస్తే అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఏ మూవీ ముందు రిలీజ్ అయినా.. నెక్స్ట్ వచ్చే దానితో కంపేర్ చేస్తారు. దీంతో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అమీర్- హిరాణీ మూవీ వాయిదా పడడంతో.. దర్జాగా తారక్ తో రాజమౌళి రూపొందించొచ్చు! మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి
