హాలీవుడ్ లో జక్కన్న తీస్తే అక్కడ సంచలనమే!
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకశిఖరం రాజమౌళి సృష్టించే దృశ్యకావ్యాలు దేశీయంగానే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తాయి.
By: Srikanth Kontham | 25 Oct 2026 10:00 PM ISTభారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకశిఖరం రాజమౌళి సృష్టించే దృశ్యకావ్యాలు దేశీయంగానే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తాయి. `బాహుబలి` సిరీస్‌తో పాన్-ఇండియా మార్కెట్‌కు కొత్త అర్థం చెప్పిన జక్కన్న అటుపై `ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఆస్కార్ వరకు వెళ్లి పాశ్చాత్య ప్రపంచాన్ని సైతం విస్మయానికి గురిచేశారు. ప్రస్తుతం హాలీవుడ్ ప్రముఖ స్టూడియోలు, దిగ్గజ నిర్మాతలు రాజమౌళి దర్శకత్వంలో పనిచేసేందుకు తీవ్రంగా ఆసక్తి చూపించడంతోఒ జక్కన్న హాలీవుడ్ ఎంట్రీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇండియన్ సినిమా స్క్రీన్‌పై విజువల్ వండర్స్‌ను ఆవిష్కరించిన రాజమౌళికి హాలీవుడ్ నుంచి అనేక ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మైండ్-బ్లోయింగ్ ఏజెన్సీలు ఆయనతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నాయి. మన పురాణాలు.. సాంస్కృతిక నేపథ్యాన్ని గ్రాండ్ విజువల్స్‌తో.. బలమైన భావోద్వేగాలతో మిళితం చేసి చెప్పడంలో రాజమౌళికి ఉన్న ప్రావీణ్యం పాశ్చాత్య ఫిలిం మేకర్లను సైతం ఆశ్చర్య పరిచింది. దాంతో ఆయన డైరెక్షన్‌లో ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ వస్తే అది ఏ స్థాయిలో ఉంటుందోనని హాలీవుడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
ఒకవేళ రాజమౌళి గ్లోబల్ లెవెల్లో హాలీవుడ్ ప్రాజెక్ట్ లేదా అంతర్జాతీయ నటీనటులతో సినిమా తీస్తే అక్కడ సంచల నాలు నమోదవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలోనే వేల కోట్ల బాక్సాఫీస్ సామర్థ్యాన్ని నిరూపించిన మేకర్ హాలీవుడ్‌లోని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అపరిమితమైన బడ్జెట్ , గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తే ఆ చిత్రం సాధించే విజయం భూగోళాన్ని షేక్ చేయడం ఖాయం. పాశ్చాత్య ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఓ కొత్త తరహా కథన శైలిని అందించగలరనడంలో సందేహం లేదు.
భారతదేశంలోనే పరిమిత వనరులతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన కథలను ఆవిష్కరించే రాజమౌళి హాలీవుడ్‌కు వెళ్తే ఇంకెంత పక్కా ప్లానింగ్‌తో ఉంటారో? ఊహించడం కష్టం . ప్రీ-ప్రొడక్షన్ నుంచి స్టోరీబోర్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ , ప్రి-విజువలైజేషన్ వరకు ప్రతి విషయంలోనూ రాజమౌళికి ఉన్న పర్‌ఫెక్షన్ తెలిసిందే. ప్రతి సన్నివేశాన్ని చెక్కినట్లు చెక్కే ఆయన పనితనం, హాలీవుడ్ ప్రొడక్షన్ ప్రమాణాలకు తోడైతే అది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో కలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా `వారణాసి` ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల ప్రదేశాలలో చిత్రీకరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌లోకి నేరుగా అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం తో అంతర్జాతీయ ప్రేక్షకులకు ఇండియన్ మేకింగ్ సత్తాను మరోసారి రుచి చూపించిన తర్వాతే జక్కన్న హాలీవుడ్ స్టూడియోస్‌తో స్ట్రెయిట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
