జక్కన్న టీమ్ టాలెంట్ కు కార్తికేయ బాస్ అయితే?
రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈసారి వచ్చే వారణాసి దెబ్బకు హాలీవుడ్ బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యేలా ఉంది.
By: M Prashanth | 19 Jun 2026 5:00 AM ISTరాజమౌళి సినిమా అంటే టాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈసారి వచ్చే వారణాసి దెబ్బకు హాలీవుడ్ బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యేలా ఉంది. అయితే ఆయన నుంచి శిష్యులు ఎందుకు రావడం లేదన్నా వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇదివరకే త్రికోటి దిక్కులు చూడకు రామయ్య, అశ్విన్ గంగరాజు ఆకాశవాణి అంటూ ఏదో ట్రై చేసినా పెద్దగా క్లిక్ కాలేదు.
రాజమౌళి ఒక ప్రాజెక్ట్ మొదలుపెడితే అది పూర్తవ్వడానికి కనీసం మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈ గ్యాప్ లో ఆయన టీమ్ లో ఎంతో మంది టాలెంటెడ్ యువకులు అసిస్టెంట్లుగా పనిచేస్తుంటారు. కానీ వాళ్లలో చాలామంది డైరెక్టర్లుగా మారడానికి ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధాన కారణం జక్కన్నకు వాళ్లను ప్రత్యేకంగా గైడ్ చేసి లాంచ్ చేసేంత సమయం లేకపోవడమే. గ్లోబల్ రేంజ్ లో సినిమాలు తీస్తున్నప్పుడు ఆ ఒత్తిడి మామూలుగా ఉండదు. స్క్రిప్ట్ దశ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకోవాలి.
ఇలాంటి బిజీ షెడ్యూల్స్ లో తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్లను పిలిచి, వాళ్ల కథలు విని, నిర్మాతలను సెట్ చేసేంత ఖాళీ రాజమౌళికి అస్సలు దొరకదు. అందుకే ఆయన స్కూల్ నుంచి బయటకు వచ్చి సొంతంగా సినిమాలు తీస్తున్న వాళ్ల సంఖ్య ఇండస్ట్రీలో చాలా తక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే ఎస్ఎస్ కార్తికేయ ఎంటర్ అయితే సీన్ మొత్తం మారిపోతుందని అనిపిస్తోంది. కార్తికేయ కేవలం జక్కన్న కొడుకు మాత్రమే కాదు, ప్రొడక్షన్ పనుల్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. లైన్ ప్రొడ్యూసర్ గా ఎంతో ప్రాక్టికల్ అనుభవం ఉంది.
ముఖ్యంగా వాళ్ల టీమ్ లో ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో, ఎవరికి ఏ జోనర్ సెట్ అవుతుందో కార్తికేయకు ఉన్నంత పక్కా క్లారిటీ ఇంకెవరికీ ఉండదు. ఈ టాలెంటెడ్ కుర్రాళ్లందరినీ ఒక చోట చేర్చి కార్తికేయ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. రాజమౌళి విజన్ తో ట్రైన్ అయిన వాళ్లకు, కార్తికేయ లాంటి ప్లానింగ్ ఉన్న నిర్మాత తోడైతే అవుట్ పుట్ అద్భుతంగా వస్తుంది. తండ్రికి ఎలాంటి భారం పడకుండానే, వాళ్ల బ్రాండ్ వాల్యూను నిలబెట్టే బాధ్యత కొడుకు పర్ఫెక్ట్ గా డీల్ చేయగలడు.
కార్తికేయ లాంచ్ చేయడం వల్ల ఆ యువ దర్శకులకు కూడా మంచి స్వేచ్ఛ దొరుకుతుంది. వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా, మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో ఇండస్ట్రీకి సరికొత్త మేకర్స్ పరిచయం అవుతారు. రాజమౌళి స్కూల్ అంటే యాక్షన్, గ్రాఫిక్స్ మాత్రమే కాదు, ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా పండించగలరు అనేది వీళ్ల ద్వారా మరింత బలంగా బయటకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ కు కొత్త ఐడియాలు చాలా అవసరం. జక్కన్న సెట్స్ లో ఏళ్ల తరబడి కష్టపడి నేర్చుకున్న విద్యను బయటపెట్టడానికి ఆ కుర్రాళ్లకు సరైన ప్లాట్ ఫామ్ కావాలి. కార్తికేయ ఆ బాధ్యత తీసుకుని సొంతంగా వాళ్లను డైరెక్టర్లుగా ప్రమోట్ చేస్తే, భవిష్యత్తులో ఇండస్ట్రీకి ఎంతో మంది టాప్ క్లాస్ మేకర్స్ దొరకడం గ్యారెంటీ. మరి ఈ ఐడియాను కార్తికేయ ఎప్పటికైనా ఆలోచిస్తాడేమో చూడాలి.
