Begin typing your search above and press return to search.

మ‌హేష్ కు వెకేష‌న్ హాలీడేస్!

సినిమా రంగంలో రాజమౌళి పర్ఫెక్షన్, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. జ‌క్క‌న్న చిత్రాల షూటింగ్ సమయంలో హీరోలు, సాంకేతిక నిపుణులు ఎంతగానో శ్రమిస్తుంటారు.

By:  Srikanth Kontham   |   5 Aug 2026 2:54 PM IST
మ‌హేష్ కు వెకేష‌న్ హాలీడేస్!
X

సినిమా రంగంలో రాజమౌళి పర్ఫెక్షన్, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. జ‌క్క‌న్న చిత్రాల షూటింగ్ సమయంలో హీరోలు, సాంకేతిక నిపుణులు ఎంతగానో శ్రమిస్తుంటారు. రాజమౌళి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పుడు హీరోలకు ఏమాత్రం విశ్రాంతి దొరకదు. సుదీర్ఘ షెడ్యూల్స్, నిరంతర రిహార్సల్స్ మధ్య ఇతర వ్యక్తిగత పనులకు ..వెకేషన్లకు అవకాశం ఇవ్వడం రాజ‌మౌళి శైలిలో అరుదు. అయితే ప్రస్తుతం మహేష్ తో తెర‌కెక్కిస్తోన్న 'వారాణాసి' చిత్రానికి సంబంధించి ఈ ట్రెండ్ మారిపోవడం ఆశ్చ‌ర్య‌క‌రం.

మహేష్ కుటుంబంతో కలిసి తరచూ విదేశీ విహారయాత్రలకు వెళ్లడాన్ని ఎంతో ఇష్టపడతారు. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. రాజమౌళి వంటి కఠినమైన దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు ఈ వెకేషన్లకు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా రాజమౌళి స్వయంగా మహేష్ కు కావాల్సినన్ని సెలవులు ఇస్తున్నారు. మ‌హేష్ వ్యక్తిగత సమయానికి పూర్తి గౌరవం ఇస్తున్నారు. ఇటీవల జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ తర్వాత కూడా మహేష్‌కు తగినంత విశ్రాంతి దొరకడం గమనార్హం. అంత‌కుముందు రెండు...మూడు సార్లు మ‌హేష్ విదేశాలకు వెకేష‌న్ కు వెళ్లొచ్చొరు.

మహేష్ కు రాజమౌళి ఇలా వెకేషన్ హాలీడేస్ మంజూరు చేయడం వెనుక ఓ సుదీర్ఘమైన వ్యూహం ఉందనేది విశ్లేషకుల మాట. 'వారాణాసి' గ్లోబల్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో వినూత్నమైన కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్. ఈ స్థాయి చిత్రాల షూటింగ్ స‌మ‌యంలో నటులు మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసంగా ఉండాలి. నిరంతరం ఒకే సెట్‌లో ఉండి ఒత్తిడికి గురికాకుండా మధ్యమధ్యలో బ్రేక్‌లు తీసుకోవడం వల్ల నటుడి సృజనాత్మక శక్తి రెట్టింపు అవుతుందని రాజమౌళి వార‌ణాసి విష‌యంలో న‌మ్ముతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా, రియాల్టీకి దగ్గరగా తీసుకురావడానికి మహేష్ తీవ్ర శ్రమనందిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు, ప్రత్యేకమైన శారీరక పరివర్తన కోసం ఆయన చాలా కాలంగా కష్ట పడుతున్నారు. ఇలాంటి భారీ కసరత్తులు చేసే సమయంలో మానసిక ప్రశాంతత అంతే అవసరం. కుటుంబంతో గడిపే సమయం మహేష్ కు సరికొత్త శక్తిని ఇస్తుందని ఆ పాజిటివ్ ఎనర్జీని తన నటనలో చూపిస్తారని రాజమౌళి భావిస్తున్నట్లు క‌నిపిస్తుంది.

రాజమౌళి దర్శకుడిగా కాకుండా, నటుడిని మానసికంగా అర్థం చేసుకునే సహచరుడిగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ వెకేషన్స్ నిదర్శనంగా నిలుస్తుంది. హీరోలపై అనవసరమైన భారం మోపకుండా వారి జీవనశైలికి తగినట్లుగా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేయడం రాజమౌళి పరిణతికి అద్దం పడుతోంది. ఎవరి శైలిని వారు గౌరవిస్తూ సినిమా అవుట్‌పుట్ పై మాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. అంతిమంగా `వారాణాసి` ఇండియన్ సినిమా హిస్టరీలోనే మైలు రాయిగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడి అంకితభావం, హీరో పడే శ్రమ రెండూ కలిసి తెరపై అద్భుతాలను సృష్టిస్తాయనడంలో సందేహం లేదని బ‌ల‌మైన న‌మ్మ‌కంతో ఉన్నారు.