Begin typing your search above and press return to search.

రాజమౌళి రోజుకి ఎన్ని గంటలు కష్టపడతాడో తెలుసా?

సినిమా రిలీజ్ చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవచ్చు, కానీ ఒకసారి సినిమా రిలీజ్ అయిందంటే దాని ఇంపాక్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది.

By:  Gopi Velupala   |   17 Oct 2026 8:00 PM IST
రాజమౌళి రోజుకి ఎన్ని గంటలు కష్టపడతాడో తెలుసా?
X

కథను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దర్శకుడి విజన్ కి తగ్గట్టుగా ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించాలి. అప్పుడు మాత్రమే దర్శకుడు అనుకున్న కథ ప్రేక్షకుడికి పూర్తిగా కనెక్ట్ అవుతుంది. లేకపోతే మాత్రం సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించకపోవచ్చు. ఈ విషయంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు. తను ఏదైతే కథ అనుకుంటాడో దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథని తన ఐడియాలజీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకొని ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే సన్నివేశాలు పడితే విజిల్స్ వేస్తారు... తమ అభిమాన హీరో ఎలాంటి వీరోచితమైన పోరాటం చేయాలని కోరుకుంటారో వాటన్నింటికి దర్శక ధీరుడు తన సినిమాల్లో సమాధానం చెబుతుంటాడు.

రాజమౌళి ఎన్ని గంటలు కష్టపడుతాడు...

ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలు చేస్తే అందులో 12 సూపర్ హిట్స్ గా నిలిచాయి. రాజమౌళి కి సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు, అనుక్షణం సినిమా గురించే ఆలోచిస్తాడు. సినిమాలో ఏముంటే బావుంటుంది. మొదటిరోజు టికెట్ కొనుక్కొని థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు సినిమా అయిపోయిన తర్వాత కాలర్ ఎగరేసుకొని బయటికి వెళ్లాలంటే మనం ఏం చేయాలి.

కాన్ఫ్లిక్ట్ ను ఎలా సెట్ చేయాలి. ఎమోషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎలివేషన్ ను ఎలా రాసుకోవాలి దానిమీద ఆయన పూర్తి ఫోకస్ చేస్తుంటాడు. ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? లాజికల్ గా సెట్ అయిందా? ప్రేక్షకుడు దీనిని నిజంగానే ఓన్ చేసుకోగలుగుతాడా ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నాడా లేదా అనే విషయాలన్నింటిని క్రాస్ చెక్ చేసుకుంటూ ఆయన సినిమాలను చేస్తుంటాడు.

సినిమా రిలీజ్ చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవచ్చు, కానీ ఒకసారి సినిమా రిలీజ్ అయిందంటే దాని ఇంపాక్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. అందుకే రాజమౌళిని దర్శక ధీరుడు అని చాలా గర్వంగా చెబుతుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మొదటి దర్శకుడు రాజమౌళి కావడం విశేషం... ఇక ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు రాజమౌళి వేసిన బాటలో నడుస్తున్నారు. ఏదేమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి గ్రేట్ అనే చెప్పాలి...

రాజమౌళి అంత కష్టపడుతాడా

రాజమౌళి ఒక సినిమాకి కమిట్ అయిన తర్వాత రోజుకి 18 గంటల పాటు వర్క్ చేస్తూనే ఉంటాడట. అనుక్షణం సినిమా గురించి ఆలోచిస్తాడు. ఆయన కష్టాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తన కష్టాన్ని చూస్తే బాధ అనిపిస్తుందట. రాజమౌళి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడు. కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా అని అతన్ని అడిగితే రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఎప్పుడు రిలాక్స్ అవుతూనే ఉంటాం. అందుకే అనుక్షణం ఏదో ఒక పని చేయడానికి ఎప్పుడు సిద్ధం ఉండాలి. అలాంటప్పుడే కొత్త ఉత్సాహం జనరేట్ అవుతుంది. తద్వారా మనం అనుకున్నట్టుగా వర్క్ జరుగుతుందని చెబుతుంటారట. మొత్తానికైతే రాజమౌళి ప్రతి సినిమా విషయంలో ప్రతిఫలం దక్కుతుంది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' సినిమాతో మరోసారి పలు రికార్డులను బ్రేక్ చేయాలనే ప్రయత్నం లో ఉన్నాడు...