వారణాసి ఈవెంట్‌లో షాక్.. గ్లింప్స్ మిస్‌పై కార్తికేయ రియాక్షన్ వైరల్!
గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
By: Madhu Reddy | 26 Sept 2026 12:07 PM ISTగ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో గ్లింప్స్ ప్లే కానప్పుడు తాను పడిన టెన్షన్ గురించి ఫన్నీగా షేర్ చేసుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్ మధ్యలో ఊహించని షాక్:
రాజమౌళి సినిమాలంటేనే ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్ ఉంటుంది. అలాంటిది అంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'వారణాసి' గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో వీడియో సడన్‌గా ప్లే కాకపోవడం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. వేదికపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.ఇక ఆ క్షణంలో నిర్మాతగా తాను పడిన టెన్షన్ గురించి కార్తికేయ సరదాగా వివరిస్తూ అసలు ఏం జరిగిందో బయటపెట్టారు.
ఏడుపొచ్చేసింది.. నానిలా అరిచేశా!:
గ్లింప్స్ సరిగ్గా ప్లే కానప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో కార్తికేయ చెబుతూ.. అసలు తనకు ఏడుపొచ్చేసిందని సరదాగా నవ్వించారు. ఎవరిదో తప్పు కాదని, టెక్నికల్ సమస్య అని, ఆ తర్వాత ఫార్మేట్ మార్చి ప్లే చేశారని తెలిపారు. సినిమా 'జెర్సీ' మూవీలో నాని రైల్వే స్టేషన్లో అరిచినట్లుగా ఆ సమయంలో తాను లోపల అలాగే అరిచేశానని చెప్పడం అందరినీ నవ్విస్తోంది. ఇక పెద్ద సినిమాల ఈవెంట్స్ వెనుక నిర్మాతలు ఎంత టెన్షన్ పడతారో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు.
సుమతో సరదా సంభాషణ.. వైరల్ అవుతున్న వీడియో:
ప్రముఖ యాంకర్ సుమతో జరిగిన ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రోజుల నుంచి తాను రాజమౌళితో చూస్తున్న అని కార్తికేయ గుర్తుచేసుకున్నారు. ప్రతీ సినిమాకు ఎంతో రిహార్సల్ ఉంటుందని చెబుతూనే, ఆ క్షణంలో తాను ఎదుర్కొన్న భయాలను చాలా కూల్‌గా, ఫన్నీగా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో, ఫ్యాన్స్ కార్తికేయ రియాక్షన్‌ను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్‌తో బిజీగా ‘వారణాసి’ టీమ్:
షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో ప్రస్తుతం 'వారణాసి' చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులపై పూర్తి దృష్టి పెట్టారు. రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్, టెక్నికల్ వాల్యూస్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను 2027 ఉగాది కానుకగా ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
టెన్షన్స్ తట్టుకుంటేనే సక్సెస్:
సినిమా రంగంలో ఎంత పెద్ద ప్లానింగ్ ఉన్నా, స్టేజ్ మీద జరిగే కొన్ని ఊహించని పొరపాట్లు నిర్మాతలకు గుండెదడ పుట్టిస్తుంటాయి. 'వారణాసి' గ్లింప్స్ సమయంలో కార్తికేయ పడిన టెన్షన్ ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఏదేమైనా ఆ చిన్నపాటి టెక్నికల్ ప్రాబ్లం తర్వాత సినిమాపై హైప్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అక్టోబర్ 2న రాబోతున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కార్తికేయ పంచుకున్న ఈ క్యూట్ అండ్ ఫన్నీ అనుభవం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
