Begin typing your search above and press return to search.

బాలీవుడ్ మొత్తాన్ని ఎర‌గా వాడుకున్న తెలుగు ద‌ర్శ‌కుడు

ఇటీవ‌లే కింగ్ ఖాన్ షారూఖ్ త‌న 60వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కింగ్ టీజ‌ర్ చాలా ర‌కాలుగా చ‌ర్చ‌కు తెర తీసింది.

By:  Sivaji Kontham   |   3 Nov 2025 9:22 PM IST
బాలీవుడ్ మొత్తాన్ని ఎర‌గా వాడుకున్న తెలుగు ద‌ర్శ‌కుడు
X

ఇటీవ‌లే కింగ్ ఖాన్ షారూఖ్ త‌న 60వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కింగ్ టీజ‌ర్ చాలా ర‌కాలుగా చ‌ర్చ‌కు తెర తీసింది. ఈ టీజ‌ర్ ని షేర్ చేసిన ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ `షారూఖ్ ఇండియాస్ కింగ్` అంటూ సోష‌ల్ మీడియా డిబేట్ కి తెర తీసారు. అంత‌కుముందు సందీప్ వంగా `స్పిరిట్` టీజ‌ర్ ని విడుద‌ల చేస్తూ ప్ర‌భాస్ ని `ఇండియాస్ బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్` అని టీజ్ చేసాడు. దీని ఫ‌లితంగా సందీప్ వంగాకు పోటీగానే సిద్ధార్థ్ ఆనంద్ ఇలా ఖాన్ ని హైలైట్ చేసాడ‌ని చాలామంది భావిస్తున్నారు.

భార‌త‌దేశంలో అతి పెద్ద స్టార్ ఎవ‌రు? నిజ‌మైన బాక్సాఫీస్ కింగ్ ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేచింది. చాలా మంది షారూఖ్ ఖాన్ ఎప్ప‌టికీ కింగ్ అని అంగీక‌రించారు. అయితే అత‌డితో పోలిస్తే, అత్యంత వేగంగా పాన్ వ‌ర‌ల్డ్ లోకి దూసుకెళుతున్న స్టార్ గా ప్ర‌భాస్ గొప్ప‌త‌నాన్ని కొంద‌రు హైలైట్ చేస్తున్నారు.

ముఖ్యంగా రెడ్డిట‌ర్ల‌లో దీనిపై చాలా ఆస‌క్తిక‌ర డిబేట్ కొన‌సాగుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఉద్ధేశం ప్ర‌కారం.. సూప‌ర్ స్టార్ అంటే కేవ‌లం షారూఖ్ మాత్ర‌మే.. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌ను `ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్` అని ప్ర‌స్థావించ‌డాన్ని అత‌డు జీర్ణించుకోలేక‌పోతున్నాడు. ప్రభాస్‌ను అతిపెద్ద సూపర్‌స్టార్‌గా ముద్ర వేయడం షారుఖ్ అభిమానులకు పెద్దగా నచ్చలేదు.. వారు ట్విట్టర్‌లో ఆ ట్యాగ్‌ను ఎగతాళి చేశారు.

చాలా మంది ప్ర‌భాస్-వంగా తో సిద్ధార్థ్ వివాదం చాలా చిన్న‌ది. షారూఖ్ సూప‌ర్ స్టార్ కంటే పెద్ద‌వాడు! అని వ్యాఖ్యానించారు. ``సిద్ ఆనంద్ క్యాజువల్‌గా ప్రభాస్, వంగాలను ట్రోల్ చేస్తున్నారు`` అని ఒక రెడ్డిటర్ రాశాడు. ఒక‌వేళ సిధ్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తే అతడు వంగా ముందు లొంగిపోయిన‌ట్టేన‌ని ఒక రెడ్డిట‌ర్ అన్నాడు. అతడు(సందీప్) తన చిత్రానికి హైప్ పెంచ‌డానికి వివాదాస్ప‌దం చేస్తున్నాడ‌ని అన్నారు. `వంగా కోరుకున్నది ఇదే` అని ఒకరు రాశారు. మరొకరు ``వంగా కోపంతో మొత్తం బాలీవుడ్‌ను ఎర వేసినట్లు కనిపిస్తోంది`` అని వ్యాఖ్యానించారు.

అయితే ఇలా ట్యాగులు ఇచ్చినంత మాత్రాన ద‌ర్శ‌కుల‌పై బురుద జ‌ల్ల‌డంలో బిజీ అవ్వ‌డాన్ని తెలివిత‌క్కువ‌త‌నం అని కొంద‌రు వాదించారు. ``నేను కింగ్ అని చెప్పుకునే ఏ వ్యక్తి అయినా నిజమైన కింగ్ (రాజు) కాదు`` అని ఒక రెడ్డిట‌ర్ వాదించాడు. చాలామంది ప్ర‌భాస్ కి మ‌ద్ధ‌తు ప‌లికారు. బాహుబ‌లి సినిమా నుంచి స‌లార్, క‌ల్కి 2898 ఏడి వ‌ర‌కూ అత‌డు సాధించిన అసాధార‌ణ బాక్సాఫీస్ ఓపెనింగుల‌ను ప్ర‌స్థావించారు. భార‌త‌దేశంలో ఏ ఇత‌ర స్టార్ అయినా ఇలాంటి డ్రీమ్ ర‌న్ కావాల‌ని కోరుకుంటార‌ని కూడా వాదించారు. ప్ర‌భాస్ ని మీరు ద్వేషించండి లేదా అభిమానించండి.. ప్రభాస్ సినిమాకి వచ్చే ఓపెనింగ్ చాలా మంది సూపర్‌స్టార్ ల‌కు డ్రీమ్ ర‌న్ అని అన్నారు. అది ప్రభాస్ ప్రభావం. అతడు తన జీవితంలో ఐదేళ్ల పాటు బాహుబలి ఫ్రాంఛైజీ కోసం ఇచ్చిన ఫలితాన్ని ఇదంతా సూచిస్తోంది. దాన్ని అధిగమించి నిరూపించండి! అంటూ ఒకరు వాదించారు.