60 ఏళ్ల వయసులోనూ మాస్ లవర్‌గా షారుఖ్ ఖాన్ అదుర్స్!
కొత్త పోస్టర్లో షారుఖ్ ఖాన్ తనదైన స్టైల్లో మంటల మధ్య నడుచుకుంటూ వస్తుండగా నోటిలో గులాబీ పువ్వు, చేతిలో గన్‌తో ఎంతో ఇంటెన్సెస్ లుక్‌లో కనిపించారు.
By: Srikanth Kontham | 27 Oct 2026 4:31 PM ISTబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ `కింగ్` సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ స్వయంగా పంచుకున్న కొత్త పోస్టర్ సినీ వర్గాల్లో.. అభిమానులలో ట్రెండ్ అవుతోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.
కొత్త పోస్టర్లో షారుఖ్ ఖాన్ తనదైన స్టైల్లో మంటల మధ్య నడుచుకుంటూ వస్తుండగా నోటిలో గులాబీ పువ్వు, చేతిలో గన్‌తో ఎంతో ఇంటెన్సెస్ లుక్‌లో కనిపించారు. ముఖ్యంగా క్లాసిక్ సినిమా `బాద్షా` చిత్రంలోని పాపులర్ లైన్‌ను గుర్తుచేస్తూ తాను హంతకుడిని కాదని, ప్రేమికుడిని అంటూ క్యాప్షన్ ఇవ్వడం విశేషం. `ఆజ్ ఫిర్ యాద్ ఆయా... ఖాతిల్ నహీ... ఆషిక్ హూ...` అంటూ షారుఖ్ పంచుకున్న మాస్ అండ్ రొమాంటిక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
అరు పదుల వయసులోకి అడుగు పెట్టినా? షారుఖ్ ఖాన్ తనలోని రొమాంటిక్ అప్పీల్‌ను ఏమాత్రం తగ్గించలేదని ఈ పోస్టర్ నిరూపిస్తోంది. గత ఏడాది షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో సిల్వర్ హెయిర్, యాక్షన్ ఓరియెంటెడ్ లుక్‌తో `దర్ నహీ, దెహ్షత్ హూ` అంటూ భయపెట్టిన షారుక్ ఇప్పుడు సడన్‌గా రొమాంటిక్ టచ్ ఇవ్వడం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. యాక్షన్‌తో పాటు లవ్ అండ్ ఎమోషన్స్‌ను చిత్రంలో ఏ స్థాయిలో బ్లెండ్ చేశారనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది.
ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తికర ప్రశ్నకు ఇటీవల `ఆస్ ఎస్ఆర్కే` సెషన్లో షారుఖ్ సరదాగా సమాధానమిచ్చారు. అభిమానులను కావాలనే ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదని, సినిమాను అత్యుత్తమంగా మలచడానికే కొంత సమయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డిసెంబర్ 24వ తేదీకి ముందే అన్ని అప్డేట్స్ వస్తాయని.. నేరుగా థియేటర్లలోనే సినిమా చూసి ఆనందించాలని సూచించారు.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, రాఘవ్ జుయాల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. `పఠాన్` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత షారుఖ్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మొత్తానికి క్రిస్మస్ బరిలో దిగుతున్న `కింగ్` బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. యాక్షన్.. రొమాన్స్.. సెంటిమెంట్ కలగలిపిన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కోసం బాద్ షా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా పోస్టర్‌తో అంచనాలు అంతకంకతకు రెట్టింపు అవుతున్నాయి.
