ఆ స్టార్ హీరో చదువులోనూ కింగే!
ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ డిగ్రీ మార్క్స్ షీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Madhu Reddy | 3 Dec 2025 11:04 AM ISTసాధారణంగా స్టార్ హీరోలు లేదా హీరోయిన్స్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి కనబరుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, వారి బాల్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సెలబ్రిటీల చదువుకు సంబంధించి మార్క్స్ షీట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ.. వారి టాలెంట్ ను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పటికే చిరంజీవి వంటి అగ్ర హీరోల మార్క్స్ మెమోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ డిగ్రీ మార్క్స్ షీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు చదువులో కూడా సత్తా చాటినట్లు ఈ మార్క్స్ షీట్ రుజువు చేస్తోంది. మరి షారుఖ్ ఖాన్ డిగ్రీ మార్క్స్ షీట్ ను బట్టి చూస్తే ఆయనకు డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏ సబ్జెక్టులో ఆయనకు పట్టు ఉంది? అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. షారుఖ్ ఖాన్ ఢిల్లీలోని ప్రఖ్యాత హన్స్ రాజ్ కాలేజీలో 1985 - 88 మధ్య ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసినట్లు మార్క్స్ షీట్ చెబుతోంది. ఆయనకు ఎలక్టివ్ లో 92, మాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులో 78 చొప్పున మార్కులు రాగా.. ఇంగ్లీషులో 51 మార్కులు వచ్చాయి. మొత్తానికైతే బిఏ ఎకనామిక్స్ లో తన టాలెంట్ ఏంటో నిరూపించారు షారుఖ్ ఖాన్. ప్రస్తుతం ఈయన మార్క్స్ మెమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇకపోతే ఉన్నత చదువులు చదివిన షారుఖ్ ఖాన్ సినిమా రంగం వైపు అడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.. టీవీ వ్యాఖ్యాతగా తన కెరియర్ ను ఆరంభించిన ఈయన.. ఆ తర్వాత నిర్మాతగా, సినీ నటుడిగా తన టాలెంట్ ను నిరూపిస్తూ.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా ఇప్పటికీ హీరోగా చలామణి అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక తన అద్భుతమైన నటనతో అభిమానుల చేత బాద్ షా , కింగ్ ఖాన్ అనే బిరుదులను కూడా అందుకున్నారు. దాదాపు 80 సినిమాలలో నటించిన ఈయన.. 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు ఇటీవల నేషనల్ అవార్డుతో పాటు పద్మశ్రీ అవార్డు కూడా ఈయనను వరించింది.
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువగా నివసించే ప్రదేశాలలో కూడా ప్రసిద్ధ నటుడిగా పేరు దక్కించుకున్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ అందుకున్న ఫిలిం స్టార్ లలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు షారుక్ ఖాన్.సుమారుగా కొన్ని వేలకోట్ల ఆస్తులను సంపాదించి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఒకరిగా చేరిపోయారు. ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ కు సంబంధించిన ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అనడంలో సందేహం లేదు.
