ఏడిపించడం ఎలాగో ఆ హీరోకి బాగా తెలుసు!
సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఆ సమయంలో కంటి నిండా ఏడాల్సి ఉంటుంది. నిజంగా పాత్రలో నీలీనమైతేనే ఎలాంటి గ్లిజరిన్ వేసుకోకుండానే కన్నీళ్లు వస్తాయి.
By: Srikanth Kontham | 5 Dec 2025 8:00 PM ISTసినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఆ సమయంలో కంటి నిండా ఏడాల్సి ఉంటుంది. నిజంగా పాత్రలో నీలీనమైతేనే ఎలాంటి గ్లిజరిన్ వేసుకోకుండానే కన్నీళ్లు వస్తాయి. లేదంటే? కళ్లకు గ్లిజరిన్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఒకటి గతంలో మహేష్ షేర్ చేసుకున్నారు. `ఖలేజా` సినిమా షూటింగ్ సమయంలో చైతన్య అనే నటుడు ఓ సన్నివేశంలో భాగంగా ఏడవాలి. అది మహేష్ బాబుతో కాంబినేషన్ సీన్. మహేష్ డైలాగ్ చెప్పిన అనంతరం చైతన్య ఏడవాలి. దీంతో మహేష్ ఆ సీన్ కోసం చైతన్యను వెళ్లి గ్లిజరిన్ వేసుకో అని సలహా ఇచ్చాడు.
అప్పుడు చైతన్య వద్దు సార్ అని సమాధానం ఇచ్చాడు. ఆ అన్సర్ చూసి మహేష్ ఇతడు చాలా ఓవర్ కాన్పిడెన్స్ తో ఉన్నాడు? అని భావించాడు. దీంలో ఎలా ఏడుస్తాడో చూస్తానంటూ మహేష్ ఓ రకంగా అతడికి సవాల్ విసిరాడు. కానీ ఆ సవాల్ లో మహేష్ ఓడిపోయాడు. చైతన్య ఆ సీన్ లో నిజమైన ఎమోషన్ పండించడంతో కన్నీళ్లు ప్రవాహంలా వచ్చాయి. సినిమాలో ఆ సీన్ ఎంతో గొప్పగా పండింది. చాలా మంది నటులు గ్లిజరీన్ మాత్రమే వాడతారు. సహజంగా ఏడవడం అన్నది చాలా మందికి సాధ్యం కాదు. తాజాగా అనన్య పాండే కు కూడా ఈ విషయంలో షారుక్ ఖాన్ ఓ టెక్నిక్ చెప్పినట్లు గుర్తు చేసుకుంది.
చనిపోయిన వ్యక్తి గురించి భాధపడే సన్నివేశంలో సహజంగా భావోద్వేగాలు పండించడానికి షారుక్ ఓ సలహా ఇచ్చారు. ఏదైనా సినిమాలో ఎవరైనా మరణించే సన్నివేశంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు అని ఆలోచించే బధులు అతను లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకో. ఆ వ్యక్తితో సంతోషకరంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకోండి. అది మిమ్మల్ని బాధపెడుతుంది. అప్పుడు గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తాయి అని సలహా ఇచ్చారు. ఈ టెక్నిక్ ని అనన్యా పాండే చాలా సినిమాల్లో వాడినట్లు తెలిపింది. సెట్ లో చుట్టూ ఉండే వాతావరణం భిన్నంగా ఉంటుంది.
కొన్ని సార్లు సన్నివేశాలకు సెట్ వాతావరణం సింక్ అవుతుంది. కొన్ని సార్లు సింక్ అవ్వదు. అలాంటప్పుడు సీన్ లో పర్పెక్షన్ మిస్ అవుతుంది. ప్రతీ పాత్రలోనూ ఒదిగిపోవడం అన్నది ఏ నటికి సాధ్యం కాదు. మనసుకు బాగా నచ్చితే తప్ప ఆ పాత్రలో లీనమవ్వడం కష్టం. అలాంటి పాత్రలు కొన్ని మాత్రమే ప్రతీ ఒక్కరి కెరీర్ లో ఉంటాయి. ఆ సినిమాలు హిట్ అయినా? కాకపోయినా ఆ పాత్రలు మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోతాయి.
